telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఎంఐఎం కారణంగానే కేసీఆర్ ఇల్లు మునిగిపోయింది…

amith shah bjp

గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్‌ బయల్దేరి వెళ్లారు. అక్కడ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమిత్‌ షా ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత రోడ్ షో మధ్యలోనే ముగించిన అమిత్ షా.. నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అమిత్ షా మాట్లాడుతూ.. ‘జీహెచ్‌ఎంసీపై బీజేపీ జెండా ఎగురుతుంది.. బీజేపీ అభ్యర్థే మేయర్ అవుతారు.. వెళ్లిన ప్రతిచోట ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎంఐఎం ఎన్నో అక్రమ కట్టడాల్ని నిర్మించింది. అక్రమ కట్టడాల వల్లే కేసీఆర్ ఇల్లుకూడా మునిగిపోయిందని అమిత్ షా తెలిపారు. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే అక్రమ కట్టడాలన్నీ కూల్చేస్తామన్నారు. జాతీయ నాయకులు హైదరాబాద్ కు వరదలా వస్తున్నారంటూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని, మరి హైదరాబాద్ నగరంలో వరదలు సంభవించి ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కేసీఆర్, ఒవైసీ ఎందుకు రాలేదని అమిత్ షా ప్రశ్నించారు. ఎంఐఎం అక్రమ కట్టడాల వలనే కేసీఆర్ ఇల్లు మునిగిపోయింది. బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే నాలాలపై అక్రమణ నిర్మాణాలను తొలగించి చూపిస్తామని స్పష్టం చేశారు. మంచి పరిపాలన అందిస్తామని నగర ప్రజలకు వాగ్దానం చేస్తున్నామని చెప్పారు. మేం మాటిచ్చామంటే అమలు చేసి తీరుతాం అని అమిత్ షా ఉద్ఘాటించారు.

Related posts