telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆయుధాల అమ్మకాలలో .. ఆచితూచి అడుగులు వేస్తున్న అగ్రరాజ్యం..

america senate against to trump on weapon sale

అమెరికా సెనేట్‌, సౌదీ అరేబియాకు 800 కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలను విక్రయించాలన్న అధ్యక్షుడు ట్రంప్‌ ప్రతిపాదనను తిరస్కరించింది. అత్యంత అరుదైన రీతిలో కాంగ్రెస్‌ ఆమోదాన్ని పక్కన పెడుతూ సౌదీ అరేబియాకు ఆయుధాల విక్రయాన్ని సత్వరమే అమలు చేయాలని గత నెలలో అధ్యక్షుడు ట్రంప్‌ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గల్ఫ్‌ ప్రాంతంలో ఇరాన్‌ దుస్సాహసాన్ని నిలువరించేందుకు ఈ ఆయుధ విక్రయాలు అత్యవసరమని ట్రంప్‌ తన ఆదేశాలలో పేర్కొన్నారు.

రిపబ్లికన్‌ల ఆధిపత్యంలోనే వున్న సెనేట్‌ అత్యంత అరుదైన రీతిలో ఈ విక్రయాలను నిషేధిస్తూ మూడు తీర్మానాలను ఆమోదించింది. ఇందులో ఒక తీర్మానాన్ని డెమొక్రాట్‌లు ప్రతిపాదించటం విశేషం. సెనేట్‌ తీర్మానాన్ని తాను వీటో చేస్తానని ఇప్పటికే హెచ్చరించిన ట్రంప్‌ ఈ నిషేధం ద్వారా ఆపదలో వున్న మిత్రులను అమెరికా ఆదుకోదన్న సందేశాన్ని పంపుతున్నారని సెనేట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు సౌదీకి ప్రతిపాదిస్తున్న ఆయుధ విక్రయాలలో ఆయుధ సామగ్రి, బాంబులు, ప్రిసిషన్‌ గైడెడ్‌ ఆయుధ వ్యవస్థలు, సైనిక సహకారం వంటివి వున్నాయి.

అధ్యక్షుడి ప్రతిపాదనను వ్యతిరేకించిన డెమొక్రాటిక్‌ సెనేటర్‌ బాబ్‌ మెనెండెజ్‌ మాట్లాడుతూ ఇరాన్‌ నుండి ఎదురయ్యే ముప్పును ఈ ఆయుధాలేవీ అడ్డుకోలేవని స్పష్టం చేశారు. ఈ ఆయుధాలన్నింటినీ సౌదీ సర్కారు యెమెన్‌లో వినియోగించే ప్రమాదం లేకపోలేదని అన్నారు. సౌదీలకు ఆయుధాలను అందించటం ద్వారా యెమెన్‌లో కొనసాగుతున్న మానవ మారణహోమానికి ఆజ్యం పోయటమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

Related posts