telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అమెరికాలో విజృంభిస్తున్న కరోనా.. 24 గంటల్లో 1,500 మంది మృతి

Corona

అమెరికాలో కరోనా వైరస్ విజృంభించడంతో అక్కడ రోజురోజుకూ మరణాల సంఖ్య పెరుగుతోంది. గత 24 గంటల్లో 1,568 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 78,746కు పెరిగినట్టు జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ తెలిపింది. ఇప్పటివరకు 13,09,164 కరోనా కేసులు నమోదయ్యాయి.

దాదాపు మూడున్నర లక్షల కేసులు ఒక్క న్యూయార్క్‌లోనే నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే, 26,771 మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. న్యూయార్క్ తర్వాత స్థానంలో న్యూజెర్సీ ఉంది. న్యూయార్క్ తర్వాత అత్యధిక కేసులు న్యూజెర్సీలో నమోదయ్యాయి. ఇప్పటి వరకు న్యూజెర్సీలో 1,38,579 కేసులు నమోదు కాగా, 9,118 మంది ప్రాణాలు కోల్పోయారు.

Related posts