telugu navyamedia
సినిమా వార్తలు

ఏబీసీడీ : అమెరికా నా అమెరికా… లిరికల్ వీడియో

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “ఏబీసీడీ”. ఇప్పటికే హిందీ శాటిలైట్ డిజిటల్ రైట్స్ ఫ్యాన్సీ రేట్ కు అమ్ముడైన విషయం తెలిసిందే. సీనియర్ నిర్మాత డి.సురేష్ బాబు ఈ చిత్రానికి సమర్ఫకులుగా వ్యవహరిస్తుండడం విశేషం. మెగా బ్రదర్ నాగబాబు ఇందులో అల్లు శిరీష్ కు తండ్రి పాత్రలో నటించారు. బాలనటుడిగా మనకు సుపరిచితమైన భరత్ ఇందులో హీరో ఫ్రెండ్ పాత్రలో నటిస్తున్నాడు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సంజీవ్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని తో కలిసి మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ ఈ ఎంటర్ టైనర్ ని నిర్మిస్తున్నారు. కన్నడ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ జుధా సాంధీ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం నుంచి ఒక లిరికల్ వీడియోను విడుదల చేశారు. “అమెరికా నా అమెరికా నిను మిస్సవుతున్నా బాగా .. స్లమ్ములో ఈ దుమ్ములో నా ఫ్యూచర్ అర్థం కాక .. బ్యాడ్ టైమే నన్ను బ్యాటుతోటి కొడితే .. డెస్టినీ ఎగిరెళ్లి డస్టుబిన్ లో దూకిందే .. ” అంటూ ఈ పాట సాగుతోంది. జుదా శాండీ సంగీతం, భాస్కర్ భట్ల సాహిత్యం, బెన్నీ దయాళ్ – సంజిత్ హెగ్డే ఆలాపన యూత్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను, మే 17వ తేదీన విడుదల చేయనున్నారు.

Related posts