telugu navyamedia
రాజకీయ

ట్రంప్ నిర్ణయానికి .. అమెరికా జిల్లా కోర్టు చెక్.. ఆనందంలో భారతీయులు..

trump new policies on h1b visa

అమెరికాలో అక్రమంగా విదేశీ విద్యార్థులు నివసించడాన్ని అరికట్టే ఓ ప్రతికూల విధానాన్ని యూఎస్‌సీఐఎస్ (అమెరికా పౌరసత్వ, ఇమిగ్రేషన్ సేవల సంస్థ) అమలు చేయకుండా అమెరికా జిల్లా కోర్టు తాత్కాలిక నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఈ కేసు విచారణ ఇంకా పూర్తి కానప్పటికీ, ప్రస్తుతం జారీ అయిన తాత్కాలిక ఆదేశాలతో అమెరికాలో విద్యనభ్యసిస్తున్న దాదాపు రెండు లక్షల మంది భారతీయ విద్యార్థులకు ఊరట లభించనుంది. గత ఏడాది ఆగస్టు 9 నుంచి అమలులోకి వచ్చిన యూఎస్‌సీఐఎస్ విధానం ప్రకారం.. అక్రమంగా నివసిస్తున్న విద్యార్థులను నిర్దిష్ట కాలం వరకు మళ్లీ అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు.

180 రోజులు అక్రమంగా నివసించిన వారిపై మూడేండ్ల నిషేధం, ఏడాదికి పైగా నివసించిన వారిపై పదేండ్ల నిషేధం విధించనున్నారు. ఈ నిషేధం సదరు విద్యార్థులపై ఆధారపడిన వారికి, వారి జీవిత భాగస్వాములకు, పిల్లలకు కూడా వర్తిస్తుంది. దీనిపై పలు కాలేజీలు కోర్టును ఆశ్రయించాయి. విదేశీ విద్యార్థుల హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశాయి. అమెరికాలో నివసించేందుకు అనుమతించిన కాలం పూర్తి కాకపోయి నా.. ఓ విద్యార్థి తెలిసో తెలియకో తన విద్యార్థి వీసాను ఉల్లంఘించినట్టు తేలితే.. ఆ రోజు నుండే అతడు/ఆమె అక్రమంగా నివసిస్తున్నట్టు పరిగణిస్తారు. ఈ విషయం ఏడాది తరువాత వెలుగులోకి వస్తే.. సదరు విద్యార్థిపై పదేండ్ల పాటు అమెరికాలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. ఈ విధానం విద్యార్థుల భవిష్యత్తును అగమ్యగోచరం చేస్తుందని పలు విద్యా సంస్థలు కోర్టుకు విన్నవించాయి.

Related posts