telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

భారతప్రధాని అమెరికా .. పురస్కారం..

america award to indian pm

భారతదేశ ప్రధాని నరేంద్రమోడీకి అమెరికా నుండి ప్రతిష్టాత్మకమైన పురస్కారం అందింది. దేశాన్ని ప్రతిభావంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఈ పురస్కారాన్ని ఇచ్చారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి కార్యాలయం ( పీఎంఓ) ఓ ప్రకటనలో తెలిపింది. ఈ పురస్కారాన్ని ఢిల్లీలో మోదీ ఈరోజు అందుకున్నట్టు పేర్కొంది. ‘పీపుల్-ప్రాఫిట్-ప్లానెట్’ అంశాల ప్రాతిపదికన ప్రతి ఏడాది ఒక దేశానికి చెందిన నాయకుడిని ఈ అవార్డు కింద ఎంపిక చేస్తారని తెలియజేసింది. ఈ ఏడాది ఈ అవార్డును మోదీకి ప్రకటించారని తెలిపింది. దేశానికి మోదీ చేస్తున్న నిస్వార్థ సేవ ఫలితంగా ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాల్లో మంచి అభివృద్ధి కనిపించిందని ప్రశంసాపత్రంలో పేర్కొంది.

మోదీ దూరదృష్టితో కూడిన పరిపాలన వల్ల దేశంలో డిజిటల్ విప్లవానికి దోహదపడిందని, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా…వంటివి దేశానికి ఎంతగానో తోడ్పడ్డాయని.. ఆ ప్రశంసాపత్రంలో మోదీని కొనియాడింది. అమెరికాలోని నార్తర్న్ విశ్వవిద్యాలయం, కెలాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లోని మార్కెటింగ్ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ ఫిలిప్ కొత్లెర్. ఆయన పేరిట ప్రతి ఏటా ఈ పురస్కారాన్ని అందజేస్తున్నారు. ఈ ఏడాది మోడీని వరించింది.

Related posts