telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

యూఏఈకి ఆయుధ సామాగ్రిని అందించాలి…

ప్రస్తుతం ప్రతిదేశం తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దాదాపు అన్ని దేశాలు అమెరికా వద్ద నుంచి తమకు కావలసిన ఆయుధ సామాగ్రిని అధికమొత్తంలో కొనుగోలు చేసేందుకు చూస్తున్నాయి. అయితే వాటిలో కొన్నింటికి మాత్రమే అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. అయితే వాటిలో ఇప్పుడు యూఏఈ (యునైటెడ్ అరబ్ అమిరేట్స్)తో ఇటీవల ఓ ఒప్పందానికి ఓకే చెప్పింది. దాదాపు 23.37 బిలియన్ డాలర్ల విలువ చేసే ఆయుధాలను వారికి అందించేందుకు అంగీకరించింది. వాటిలో ఎఫ్-35 లైటినింగం యుధ్ద విమానాలు, ఎంక్యూ-9బీ ఏరియల్ సిస్టమ్స్ ఉన్నాయి. వీటితో పాటుగా ఆకాశంలో ఉంటూ గాల్లో తిరిగే వాటితో పాటు గాల్లో నుంచి భూమిపై తిరిగే వాటిని మట్టుబెట్టే పరికరాలను అందించేందుకు యూఎస్ అంగీకరిచింది. అయితే దీనిని అమెరికా మాజీ ప్రధాని డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఒప్పుకున్నారు. అయితే ఇటీవల యూఎస్ సెక్రెటరీ మైక్ పోమ్‌పియో దీనిపై మాట్లాడారు. యూఏఈకు మనకు ఎన్నో అనుబంధాలు ఉన్నాయని, వారు అడిగిన ఆధునిక ఆయుధ సామాగ్రిని వారికి అందిచి ఇరు దేశాల మధ్య స్నేహాన్ని నిలపాలని అన్నారు. అంతేకాకుండా యూఏఈ తనను తాను ఇస్రాయిల్ నుంచి కాపాడుకునేందుకు మాత్రమే ఆయుధాలను కోరుతుందని అన్నారు. ఈ ఆయుధాలను వారికి అందించింది స్నేహ సంబంధాలను పెంచాలని ఆయన కోరారు.

Related posts