telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

ఆఫ్ఘన్ లో .. 18 ఏళ్ళ రక్తపాతానికి .. చరమగీతం..

america and afghan taliban meeting

అమెరికా, ఆఫ్ఘన్ తాలిబన్‌ల మధ్య శాంతి చర్చలు సత్ఫలితాలు ఇవ్వాలని ప్రపంచం కోరుకుంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో గత 18 ఏళ్లుగా కొనసాగుతున్న రక్తపాతానికి తెరదించే లక్ష్యంతో కతార్‌లో జరుగుతున్న శాంతి చర్చలను పున్ణప్రారంభించేందుకు అమెరికా-ఆఫ్ఘన్ తాలిబన్‌లు అంగీకారానికి వచ్చాయి. ఆఫ్ఘన్‌ నుండి తన దళాలను ఉపసంహరించుకోవటానికి అమెరికా అంగీకరించటంతో తాలిబన్లు తమ ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఆఫ్ఘన్‌ భూభాగాన్ని వినియోగించుకోబోమని ప్రకటించినట్లు అధికారులు వివరించారు. ఇరువర్గాల మధ్య జరిగిన ఈ ఒప్పందంతో దీర్ఘకాలంగా కొనసాగుతున్న పోరుకు తెరపడుతున్నప్పటికీ, ఆఫ్ఘన్‌ ప్రభుత్వానికి, ఉగ్రవాదులకు మధ్య శాంతి ఏర్పడే అవకాశం లేదని పరిశీలకులు చెబుతున్నారు.

అమెరికా చేతిలో కీలుబొమ్మ అంటూ ఆఫ్ఘన్‌ ప్రభుత్వంపై విమర్శలతో చర్చలకు విముఖత వ్యక్తం చేస్తున్న తాలిబన్లు ఆఫ్ఘన్‌ పునర్వ్యవస్థీకరణ పేరుతో జరుగుతున్న చర్చలకు పౌరులు, తాలిబన్లతో కూడిన 60 మంది ప్రతినిధుల బృందాన్ని కతార్‌కు పంపేందుకు సుముఖత వ్యక్తం చేశారు. తాము పరస్పరం గౌరవించుకుంటూ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడుతామని, హింసకు తెరదించుతామని ఇరువర్గాలు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.

Related posts