telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వాషింగ్టన్‌ : … అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ అంతం .. సినిమా విడుదల చేసిన అమెరికా..

ameica released bagdadi operation video

అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ కరడుగట్టిన ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బాగ్దాదీకి అంతమొందించిన ఆపరేషన్‌కి సంబంధించిన వీడియో, చిత్రాలు విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికా ప్రత్యేక బలగాలు నెమ్మదిగా బాగ్దాదీ ఉన్న ఇంటిని చుట్టుముడుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే అమెరికా బలగాలు కిందకి దిగడానికి ముందే హెలికాప్టర్లపైకి కాల్పులు జరిపిన ముష్కరులపై వైమానిక దాడులు చేసిన ఘటనకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు. దాడికి ముందు బాగ్దాదీ ఇల్లు ఎలా ఉంది.. దాడి తర్వాత ఎలా మారిందో కూడా చిత్ర రూపంలో బహిర్గతం చేశారు.

పెంటగాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్‌ కమాండ్ కమాండర్‌ కెన్నెత్‌ మెకంజీ దాడికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. బాగ్గాదీని మట్టుబెట్టిన తర్వాత ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసినట్లు తెలిపారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినట్లు బాగ్దాదీ తనకు తాను పేల్చుకున్న సమయంలో అతడి ముగ్గురు పిల్లలు చనిపోలేదని ఇద్దరు మాత్రమే మృతిచెందారని వెల్లడించారు. చనిపోయిన ఇద్దరూ 12 ఏళ్ల లోపు వారేనన్నారు. అలాగే కాంపౌండ్‌లో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు మృతిచెందారని పేర్కొన్నారు. భారత్ సర్జికల్ స్ట్రైక్ తో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందింది, దానికి కౌంటర్ గానే అమెరికా ఈ ఆపరేషన్ చేసి, మరోసారి తానే గొప్ప అన్న విషయాన్ని చాటుకున్నట్టే ఉంది!

Related posts