telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పవన్‌ మాటలకు అంబికాకృష్ణ మద్దతు

ambika krishna

ప్రజాసేవ కోసం సినిమాలు వదిలేస్తున్నానని చెప్పిన పవన్‌ ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తుండడాన్ని నిరసిస్తూ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేన పార్టీకి నిన్న రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ చిత్రనిర్మాత అంబికాకృష్ణ స్పందించారు. వృత్తిని కొనసాగిస్తే అందులో తప్పుపట్టడానికి ఏముంటుందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను వెనకేసుకు వచ్చారు. లక్ష్మీనారాయణ ఎత్తిచూపిన కారణం సహేతుకంగా లేదని అన్నారు.

వృత్తిని వదిలేసి రాజకీయాలు చేయాలని ఎవరూ చెప్పలేదన్నారు. లక్ష్మీనారాయణ బయటకు వెళ్లిపోవాలనుకుంటే వెళ్లిపోవడం తప్పుకాదని, కానీ వెళ్లిపోతూ చేసిన ఆరోపణ సరికాదని హితవు పలికారు. పవన్‌ మాటలకు అంబికాకృష్ణ మద్దతు తెలిపారు. పవన్‌ సినిమాలలో నటిస్తూ రాజకీయాల్లో కొనసాగాలని తాను కోరుతున్నాని చెప్పారు.

Related posts