telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

ఆన్‌లైన్‌ రమ్మీ ఆడి.. 70 లక్షలు లాస్…

ప్రస్తుత కాలంలో ఆన్‌లైన్‌ గేమ్‌లు బాగా ఫేమస్‌ అయిపోయాయి. ఈ గేమ్‌ల ద్వారా చాలా మంది అప్పుడు చేసి… అవి తీర్చలేక ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు. అయితే.. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో జరిగింది. ఆన్‌లైన్‌ రమ్మీలో రూ.70 లక్షలు పోగొట్టుకున్నాడు ఓ వ్యక్తి. ఫేక్‌ జీపీఎస్‌ ఉపయోగించి రమ్మీ ఆడుతూ.. లక్షలు పొగొట్టుకున్నాడు అంబర్‌పేట్‌కు వాసి. రూ.70లక్షలు పొగొట్టుకొని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆ వ్యక్తి ఆశ్రయించాడు. ఆన్‌లైన్‌ రమ్మీ నిషేధం ఉండగా, ఎలా ఓపెన్‌ అయ్యిందంటూ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు చేపట్టారు. ఫేక్‌ జీపీఎస్‌తో రమ్మీ అడినట్లు నిర్ధారణ కావడం తో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. రెండేండ్లుగా రెండు ఐడీలతో బాధితుడు ఆన్‌లైన్‌ రమ్మీ ఆడుతున్నాడు. అప్పులు చేసి ఆన్‌లైన్‌లో పెట్టుబడులు పెడుతూ వస్తున్నాడు. రేపు, మాపు లాభాలొస్తాయంటూ అందులో పెట్టుబడులు పెడుతూ.. ఉన్నదంతా పొగొట్టుకున్నాడు ఆ బాధితుడు. చివరికి చేసేది ఏమీ లేక పోలీసులను ఆశ్రయించాడు.

Related posts