ఆంధ్రప్రదేశ్ రాజకీయ వార్తలు వార్తలు

ఇంటెలిజెన్స్‌ సంస్థ టీడీపీ కోసం: అంబటి

voters list marfing in andhrapradesh also said ycp

ఇంటెలిజెన్స్‌ సంస్థ టీడీపీ కోసం పనిచేస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..పోలీస్‌ వ్యవస్థను ఎల్లో డిపార్ట్‌మెంట్‌లా తయారు చేశారని మండిపడ్డారు. టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నవారిపై పోలీస్‌ యంత్రాగాన్ని ప్రయోగించారని ఆరోపించారు. ఐటీ అధికారులకు రక్షణ కల్పించలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని తెలిపారు.

ప్రతిపక్షంపై బురద చల్లడం ద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారని విమర్శించారు. తుని ఘటనపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనలో టీడీపీ నేతల ప్రమేయం ఉంది కాబట్టే విచారణ ఆపేశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రతిపక్షంపైకి నెడుతున్నారని మండిపడ్డారు. విజయవాడలో ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమలు దాడి చేస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.మహిళలపై వేధింపుల్లో రాష్ట్రం నాలుగో స్థానంలో ఉందని తెలిపారు.

Related posts

ప్రపంచ వ్యాప్తంగా ఆగిపోయిన యూట్యూబ్ సేవలు… నెటిజన్ల ఆగ్రహం..! స్పందిస్తూ

nagaraj chanti

నాకు ప్రభుత్వ ఉద్యోగం వద్దు.. కఠినంగా శిక్షించాలి… డిప్యూటీ సీఎం తో తివారీ భార్య

nagaraj chanti

ప్రేమ కోసం బ్యానర్లు… తడిసి మోపెడు అయ్యేంత జరిమానా వేసిన అధికారులు..

jithu j

Leave a Comment