telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

మళ్ళీ అంబాసిడర్ కార్లు .. ఈసారి ఎలక్ట్రిక్ ..

ambassador car again in market as electric car

ఇటీవల అంబాసిడర్ దేశంలోని కార్ల మార్కెట్లో కనిపించకుండా పోయినా, మళ్లీ ప్రత్యక్షం కానుంది. ఈసారి ఎలక్ట్రానిక్ కార్ల రూపంలో వినియోగదారుల ముందుకు రాబోతోంది. ఇటీవలే హిందూస్థాన్ మోటార్స్‌ను సొంతం చేసుకున్న ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ పీఎస్ఏ తిరిగి అంబాసిడర్ బ్రాండ్‌ను తిరిగి ప్రవేశపెట్టనుంది. 2022 నాటికి ఈ కార్లు మార్కెట్లోకి రానున్నట్టు కంపెనీ పేర్కొంది. అంబాసిడర్ కారుతో భారతీయులకు ఉన్న అనుబంధం నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది.

ambassador car again in market as electric caraఅంబాసిడర్‌లో డీఎస్‌3 క్రాస్‌బాక్‌ ఈ టెన్స్‌ ఇంజిన్‌ను అమర్చి మార్కెట్లోకి తీసుకురానుంది. తొలుత కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కానీ, క్రాసోవర్‌ వాహనాన్ని కానీ మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తోంది. మార్కెట్లో అంబాసిడర్‌కు డిమాండ్ లేకపోవడంతో మే 2014లో హిందూస్థాన్ మోటార్స్ ఈ వాహనాల తయారీని నిలిపివేసింది. ఆ తర్వాత దీనిని ఫ్రాన్స్‌కు చెందిన గ్రూప్ పీఎస్ఏ కేవలం 80 కోట్ల రూపాయలకే సొంతం చేసుకుంది.

Related posts