telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమెజాన్ లో వివక్ష… కోర్టుకెక్కిన మహిళ

Amazon

ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీ అమెజాన్‌ ఉద్యోగులు తాము వివక్షకు గురవుతున్నామంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఉద్యోగులు గర్భం దాలిస్తే వారిపై అనేక ఆంక్షలు విధిస్తున్నారని అమెజాన్‌పై ఇప్పటికే అనేక విమర్శలు వచ్చాయి. తాము వివక్షకు గురయ్యామంటూ ఇప్పటివరకు ఏడుగురు గర్భిణీ ఉద్యోగులు కోర్టుకెక్కారు. జనవరిలో బెవర్లీ రోజెస్ అనే గర్భిణి ఉద్యోగి కోర్టులో కేసు వేసింది. తాను బాత్‌రూంకు వెళ్లినా తన పై అధికారులు తిడుతున్నారని.. పనిచేయడం కంటే బాత్‌రూంకు వెళ్లడమే ఎక్కువైందని విమర్శలు చేస్తున్నారని ఉద్యోగిని ఆరోపించింది. ఉద్యోగుల కంటే ఉత్పత్తులపైనే ఎక్కువ ప్రేమ చూపిస్తారంటూ మండిపడింది. దీనిపై స్పందించిన అమెజాన్ అధికారి తమ కంపెనీలో ఎటువంటి వివక్ష లేదని, గర్భిణీలకు వైద్య అవసరాలతో పాటు అన్ని రకాల వసతులను కల్పిస్తున్నామన్నారు.

Related posts