telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

అమెజాన్ లో తాత్కాలిక నియామకాలు!

amazon

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన కార్యకలాపాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయించుకుంది.దేశవ్యాప్తంగా షాపింగ్ మాళ్లు, డిపార్ట్ మెంటల్ స్టోర్లు తెరుచుకోకపోవడంతో ఆన్ లైన్ షాషింగ్ కు గిరాకీ ఏర్పడింది. ఈ పరిణామాన్ని పసిగట్టిన అమెజాన్ తమ సేవలను విస్తృతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు 50 వేల మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కొత్తగా తీసుకునే ఉద్యోగులను అమెజాన్ ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల్లోనూ, డెలివరీ నెట్వర్క్ కేంద్రాల్లోనూ నియమించనున్నట్టు అమెజాన్ వర్గాలు తెలిపాయి. తొలి దశ లాక్ డౌన్ లో ఈ-కామర్స్ కార్యకలాపాలు కూడా నిలిచిపోయినా, ఆపై దశల వారీగా ఆంక్షలు తొలగించడంతో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు మరింత ఉత్సాహాన్ని ప్రదర్శించనున్నాయి.

Related posts