telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

నన్ను బెదిరిస్తున్నది .. ట్రంప్ స్నేహితుడి మీడియా సంస్థే..

america media blackmailing amazon ceo

ఇటీవల అమెజాన్ సీఈఓ తనను ఒక మీడియా సంస్థ బెదిరింపులకు పాల్పడుతుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఈ బెదిరింపులు రావటానికి కారణం కూడా ఆయన వెల్లడించడం విశేషం. తాను వాషింగ్టన్ పోస్ట్‌ పత్రికకు యజమానిగా ఉండటంతో ట్రంప్‌కు శత్రువుగా మారానని బెజోస్ వ్యాఖ్యానించారు. వదంతులను ప్రచురించే టాబ్లాయిడ్ ‘నేషనల్ ఎంక్వైరర్’ తన ప్రైవేటు సందేశాలను సంపాదించిందని ఆయన వెల్లడించారు. వీటిని ఎలా సేకరించారనే విచారణను నిలిపివేయాలని ఈ పత్రిక మాతృసంస్థ అయిన అమెరికన్ మీడియా ఇన్‌కార్పొరేషన్(ఏఎంఐ) తనను అడిగిందని చెప్పారు.

తాను, తన భార్య మెకంజీ విడిపోతున్నామని బెజోస్ గత నెల్లో ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటలకే ది ఎంక్వైరర్ పత్రిక బెజోస్ వివాహేతర సంబంధ వివరాలు, ఇతర ప్రైవేటు సందేశాలను ప్రచురించింది. బెజోస్ ఆరోపణలపై స్పందన కోసం బీబీసీ చేసిన విజ్ఞప్తిపై ఏఎంఐ ఇంకా స్పందించలేదు. తాను, తన ప్రేయసి, మాజీ టీవీ వ్యాఖ్యాత లారెన్ సాంచెజ్‌ ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫొటోలను ప్రచురిస్తామని బెదిరిస్తూ ఏఎంఐ ప్రతినిధులు తన తరపు మధ్యవర్తులకు ఈమెయిల్ పంపారని బెజోస్ గురువారం రాసిన బ్లాగ్ పోస్ట్‌లో ఆరోపించారు. వివిధ ఈమెయిళ్లను ఆయన తన పోస్టులో ఉంచారు. తనపై, తన ప్రేయసిపై నేషనల్ ఎంక్వైరర్ కవరేజీ రాజకీయ ప్రేరేపితం కాదని ఒక ”తప్పుడు ప్రకటన” చేయాల్సిందిగా ఏఎంఐ తనను కోరిందని బెజోస్ పేర్కొన్నారు.

Related posts