telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కుర్రాడి విన్యాసాలకు.. మంత్రి కేటీఆర్ ఫిదా

ఐటీ శాఖ మంత్రి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేటీఆర్‌ రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. రాజకీయ నాయకుడిగానే కాకుండా… సోషల్‌ మీడియా వేదికగా కూడా అందరితో ఎక్కువగా ఇంట్రాక్టివ్‌ అవుతారు. ఎవరైన ఆపదలో ఉన్నామని.. ట్వీట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తే… వెంటనే స్పందించి వాళ్ల కష్టాన్ని దూరం చేస్తాడు. ఇలాంటి ఘటనలు లాక్‌డౌన్‌లో చాలానే చూశాం. అయితే.. తాజాగా ఓ బుడ్డోడి వీడియోకు మంత్రి కేటీఆర్‌ ఫిదా అయిపోయాడు. జిమ్నాస్టిక్‌ విన్యాసాలను అలవోకగా చేస్తూ… అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఓ బుడ్డోడు. అయితే.. ఆ అబ్బాయి విన్యాసాలు కాస్త మంత్రి కేటీఆర్‌ కంట పడ్డాయి. దాంతో ఎవరీ అబ్బాయి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేసారు కేటీఆర్‌. ఒలింపిక్‌ మెడలిస్ట్‌ తర్ఫీదులో ఉన్నాడంటూ కితాబునిచ్చారు కేటీఆర్‌. అతను తెలంగాణా లేక మరో రాష్ట్రమా అంటూ ప్రశ్నించారు. ఈ అమోఘమైన ప్రతిభావండుడికి మద్దతు ఇవ్వాలంటూ కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Related posts