telugu navyamedia
health trending

ఆవాలతో ఆరోగ్య ప్రయోజనాలు

Musterd

భారతీయ వంటకాలలో, ప్రతి ఒక్కరి ఇంట్లోని పోపు డబ్బాల్లో ఉండే వంట దినుసులు ఆవాలు. వంటలలో తాలింపు వేయాలన్నా, లేదా ఆవకాయ పెట్టాలన్నా, మరికొన్ని ప్రత్యేకమైన వంటకాలకు ఆవాలు ఉండాల్సిందే. చూడడానికి పరిమాణంలో చిన్నగా కనిపించే వీటిలో ఉన్న ఔషధ గుణాలు ఎన్నో దీర్ఘరోగాలకు విరుగుడుగా పని చేస్తాయి. ఆవాల్లో అయోడిన్, జింక్, మాంగనీస్, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. ఇక ఆవాలు నలుపు, తెలుపు, ఎరుపు రంగులలో ఉంటాయి. ఇవి కారంగా, వగరుగా ఉంటాయి. ఆవాలు అధిక వేడిని పుట్టిస్తాయి. కఫము, వాతం, అజీర్ణం, దురదలు, కుష్ఠు, పక్షవాతం వంటి ఎన్నో రోగాలకు ఇవి ఔషధంగా పని చేస్తాయి.
* నీళ్ళ విరేచనాలు : దోరగా వేయించిన ఆవాలు, బెల్లం సమంగా కలిపి బాగా మెత్తగా దంచి బఠాణి గింజంత మాత్రలు చేసి ఉంచుకోవాలి. నీళ్ళ విరేచనాలతో బాధపడేవారు పూటకు ఒక మాత్ర చొప్పున రెండు లేదా మూడు పూటలు తీసుకుంటే ఆగిపోతాయి.
* మూర్ఛ : కొన్ని ఆవాలను మంచి నీటితో మెత్తగా నూరి, ఆ ముద్దను మూర్ఛ వల్ల, అపస్మారకం వల్ల తెలివి తప్పిన రోగి ముక్కు వద్ద పెడితే… ఆ వాసనకు వెంటనే తేరుకుంటారు.
* వరిబీజం : రోజూ రాత్రి పూట ఆవనూనెను వృషణంపై సున్నితంగా మర్దన చేస్తే వరిబీజం తగ్గిపోతుంది. ఆహారంలో నెయ్యికి బదులు ఆవనూనెను తింటూ ఉంటే వరిబీజం తగ్గిపోతుంది.
* తేలు విషానికి విరుగుడు : ఆవాలు, పత్తి ఆకులు నలగ్గొట్టి తెలు కుట్టిన చోట పట్టిస్తే ఒక్క నిమిషంలోనే తేలు విషం విరిగిపోతుంది.
* దురదలు, దద్దుర్లు : 50 గ్రాముల ఆవనూనెను గోరు వెచ్చగా చేసి, అందులో అమృత ధార 20 చుక్కలు కలిపి, ఆ మిశ్రమాన్ని మర్దన చేసుకుంటే దురదలు, దద్దుర్లు తగ్గిపోతాయి.
* నిద్రలో పండ్లు కొరికే పిల్లలకు : కడుపులో క్రిములుంటే పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతారు. ఆవాలను దోరగా వేయించి, దంచి, జల్లించి పెట్టుకోవాలి. ఈ పొడి అరగ్రాము మోతాదుతో, అరకప్పు పెరుగులో కలిపి ఉదయం పూట పిల్లలకు తినిపించాలి. ఇలా చేస్తే మూడు రోజుల్లో పిల్లల కడుపులో ఉన్న క్రిములు నశించిపోతాయి.
* పిల్లలకు మూడు, నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిరోజూ ఉప్పు, ఆవనూనె కలిపి పళ్లు తోమిస్తూ ఉంటే ఎలాంటి నోటి వ్యాధులు వారి దరి చేరవు.
* బోదవాపు : ఆవాలు, ఉమ్మెత్తఆకులు, ఆముదపు చెట్టు వేర్లు, మునగచెట్టు పై బెరడు సమానభాగాలు తీసుకుని, మంచినీటితో మెత్తగా నూరి బోద వాపులపైన కట్టువేసి కడుతూ ఉంటే క్రమంగా తగ్గిపోతుంది.

Related posts

అనుమానంతో .. ఆ సమయంలోనే దాడి.. హత్య..

vimala p

వోక్స్ వ్యాగన్ పై .. భారత్ ఎన్జీటీ 500 కోట్ల భారీ జరిమానా.. !

vimala p

త్వరగా శిక్ష విధించండి.. మరో పిటిషన్ వేసిన నిర్భయ తల్లి.. ఇంకెప్పుడయ్యా..

vimala p