telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కుండలో నీళ్ళు ఆరోగ్యానికి చేసే మేలు

pot

కుండలో నీళ్ళు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కుండా నీటిని సహజంగా చల్లగా చేస్తుంది. కుండకి ఉన్న చిన్న చిన్న రంధ్రాల వల్ల అందులోని నీటికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు కంటే కుండలో చల్లబరిచిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. వడ దెబ్బ నుంచే కాదు, సమ్మర్ లో వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కుండలో నీళ్ళు మనని రక్షిస్తాయి. అతి దాహం, ఒళ్ళు పేలడం వంటివి కుండలో నీళ్ళు తాగితే రావు. ఎందుకంటే అందులో నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, అవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి. మట్టి కుండ నీటికి ఉన్న పీహెచ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. అందువల్ల ఈ నీటిని తాగితే ఎసిడిటీ లాంటి గాస్ట్రిక్ ప్రాబ్లంస్ రాకుండా ఉంటాయి. రెగ్యులర్‌గా తాగడం వల్ల మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. అంతేకాదు, ఇది అందరికీ అందుబాటు ధరలో ఈజీగా దొరుకుతుంది. కుండలో ఉన్న నీళ్ళు చల్లగా ఉండటమే కాదు, జెంటిల్ గా కూడా ఉంటాయి. అందుకని ఫ్రిజ్ లో నీళ్ళ లాగా ఇవి తాగితే దగ్గూ, జలుబూ రావు. ఆస్తమాతో బాధపడేవారికి ఈ నీటి వల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. కుండని ఎంచుకోవడం వల్ల మనం వాతావరణానికి మేలు చేసిన వాళ్ళమవుతాము. 

Related posts