telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

ఉసిరితో ఇలా చేస్తే బట్టతలపై కూడా జుట్టు ఖాయం

Amla

త్రిఫలాలలో ఒక ప్రధాన ఫలం ఉసిరికాయ. భారతీయుల ఆహారపదార్థాలలో, అలాగేసౌందర్య సాధనలలో విరివిగా వాడే ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో. ‘శ్రీ ఫలం’ అని పిలువబడే ఉసిరికాయ ఎన్నో ఔషధ విలువలు కలిగింది ఉంటుంది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉన్న ఫలం ఈ ఉసిరి మన ఆయుర్వేద వైద్యంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. తల వెంట్రుకల మొదలు కాలి గోల్లు వరకు ఉసిరి మానవ శరీరానికి అద్భుతంగా ఉపయోగపడే సర్వరోగ నివారిణి. ఉసిరిలో యాంటీవైరల్‌,
యాంటి మైక్రోబియల్‌ గుణాలున్నాయి. రక్తప్రసరణను మెరుగుపరిచి శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును నిరోధించడంలో ఉసిరి దివ్యాఔషధంలా పని చేస్తుంది. ఉసిరిలో యాపిల్ కంటే మూడు రెట్ల ప్రోటీన్స్ ఉన్నాయి. దానిమ్మతో పోలిస్తే 27 రెట్లకు పైగా పోషకాలు ఉసిరిలో ఉన్నాయి.

Amla

* ఉసిరి పచ్చడి : పండు ఉసిరికాయల పచ్చడి వారంలో ఒకసారి తప్ప రోజూ రెండు పూటలా తింటూ ఉంటే పైత్యం తగ్గిపోతుంది. కానీ వాత రోగులు పాత ఉసిరి పచ్చడిని మాత్రమే తినాలి. ఇది శీఘ్రస్కలనాన్ని తగ్గిస్తుంది.
* ఉసిరి వడియాలు : పండిన ఉసిరి కాయల రసం, మినపప్పు, తగినంత ఉప్పు, కారం కలిపి రుబ్బి చేసిన వడియాలు చాలా రుచిగా ఉండడమే కాకుండా మూల వ్యాధి, పైత్యం మొదలైవన్నీ తగ్గిపోతాయి.
* జుట్టు పెరగాలంటే : ఉసిరికాయల బెరడు, మామిడి టెంకలోని జీడీ సమంగా కలిపి మంచినీటితో ముద్దగా నూరాలి. ఈ ముద్దను వారానికి ఒకటి, రెండుసార్లు జుట్టు కుదుళ్లకు పట్టించి ఆరిన తరువాత తల స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే జుట్టు బాగా పెరుగుతుంది.

Amla
* ఉసిరికాయల బెరడును మంచినీటితో మెత్తగా నూరి పొత్తి కడుపుపైన పట్టు వేస్తూ ఉంటే మూత్రాశయ సమస్యలు తొలగిపోతాయి.
* ఉసిరికాయల బెరడును, తిప్పా తీగ ముక్కలు సమంగా కలిపి నీటితో నూరి తలకు పట్టించాలి. రెండు గంటలు ఆగి స్నానం చేయాలి. ఇలా చేస్తూ ఉంటే తలలోని వేడి తగ్గి కళ్ళకు చలువ చేస్తుంది. అంతేకాదు మాడు పోటు, కణతల పోటు తగ్గిపోతుంది.
* పిల్లలు బలంగా ఉండాలంటే : ఉసిరికాయల బెరడును పెరుగు మీది తేట నీటితో కలిపి మెత్తగా నూరాలి. తరువాత శనగ గింజలంత మాత్రలు చేసి నీడలో పూర్తిగా ఆరబెట్టి నిలువ చేసుకోవాలి. పూటకు ఒక మాత్ర తల్లి పాలతో కలిపి ఇస్తూ ఉంటే ఎండిపోయే పిల్లలు బలంగా తయారవుతారు.
* ఉసిరిబెరడు, కరక్కాయ బెరడు, సయింధవ లవణం సమానముగా కలిపిన పొడిని ఒక చిటికెడు, ఒక చుక్క తేనె, రెండు చుక్కల నెయ్యితో కలిపి నాలుకకు అంటిస్తే పిల్లలు పాలు తాగుతారు. పుట్టిన శిశువు పాలు తాగకుంటే ఇలా చేయాలి.

Amla
* ఉసిరికాయల బెరడు, పటికబెల్లం పొడి సమంగా కలుపుకుని పూటకు 5 గ్రాముల మోతాదుతో రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే క్రమంగా అన్ని గుండె జబ్బులు తగ్గిపోతాయి.
* చైత్రమాసంలో పండిన ఉసిరిపండ్ల రసం, అర లీటరు మంచి కొబ్బరి నూనె, అరలీటరు గుంట గలగరాకు రసం, నీటితో నూరిన గంధ కచ్చూరాల ముద్ద 50 గ్రాములు, నీటితో నూరిన వట్టి వేర్ల ముద్ద 50 గ్రాములు… ఇవన్నీ కలిపి ఒక మట్టిపాత్రలో పోసి చిన్నమంటపైన రసాలన్నీ ఇగిరిపోయే వరకూ మరిగించాలి. తరువాత దించి చల్లార్చి నిలువ చేసుకోవాలి. దీనినే ఆమ్ల తైలం అంటారు. దీనిని ప్రతిరోజూ తలకు రాసుకుంటూ ఉంటే వెంట్రుకలు నల్లబడడమే కాకుండా క్రమంగా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా బట్టతలపై కూడా వెంట్రుకలు మొలుస్తాయి.

Related posts