telugu navyamedia
health trending

ఆముదంతో ఆరోగ్యం…!

Castor

ఆయుర్వేదంలో ఆముదం చెట్టుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆముదం నూనెలోని సుగుణాలతో భారతీయ ప్రాచీన తరాలు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించారు. ఆముదం చెట్టలోని రకాలు, దాని ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాం. ఆముదం చెట్లలో ఎర్రాముదాల చెట్టు, తెల్లాముదాల చెట్టు అని రెండు రకాలు ఉంటాయి. తెల్ల ఆముదం చెట్లలో పెద్ద గింజలు కాచేది ఒకరకం, చిన్న గింజలు కాచే చిట్టాముదం ఉంటాయి. అయితే తెల్లాముదాల చెట్టు కంటే ఎర్రాముదాల చెట్టుకే ఔషధ గుణాలు ఎక్కువని ఒక అభిప్రాయం ఉంది. గుండె జబ్బులు, విషజ్వరం, కుష్ఠు, దురద, వాపు, నులిపురుగులు, మలమూత్ర సంబంధ సమస్యలను సులువుగా నివారిస్తుంది.

శరీరంలో పేరుకుపోయిన విషతుల్యాలను బయటకు పంపడంలో దీని పాత్ర అమోఘం. ఇది అందానికీ చక్కగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జుట్టుని ఆరోగ్యంగా ఉంచడంలో కీలకంగా పనిచేస్తుందన్న విషయం అందరికి తెలిసిందే. జుట్టు పెరిగి, పట్టుకుచ్చులా మారేందుకు ఆముదం వాడుతుంటాం. ఇది కేవలం తలకే కాదు, చర్మానికీ ఎంతో మేలుచేస్తుంది. ఆముదంలో జుట్టును బలోపేతం చేయడానికి మంచి సామర్థ్యం ఉంది. ఇది చర్మం మరియు జుట్టు రెండింటి కోసం లోతైన కండీషనర్ గా పనిచేసేటటువంటి నూనె. చర్మాన్ని తెల్లబరచడం ద్వారా సహజ సిద్ధంగా అందాన్ని రెట్టింపు చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఆముదం.

* కొంతమంది జుట్టు చాలా బలహీనంగా, సున్నితంగా ఉంటుంది. ఏదైనా చిన్న ఆరోగ్య సమస్య వస్తే చాలు తొందరగా ఊడిపోతుంది. అలా కాకుండా జుట్టు బలంగా ఉండాలంటే ఆముదం నూనె ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు తలకు పట్టిస్తే సరిపోతుంది. ఇలా చేయటం వల్ల దృఢమైన, పొడవాటి జుట్టును పొందుతారు .
* ఆముదంలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఉండటం వల్ల ఎర్రబడిన లేదా ట్యాన్ ఐన చర్మంపై చక్కగా పని చేస్తుంది. స్నానానికి వెళ్లేందుకు 15 నిమిషాల ముందు ముఖానికి ఆముదాన్ని రాసుకుని మృదువుగా మర్దన చేయాలి. తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. దీనివల్ల చర్మం కాంతివంతంగా తాజాగా మారుతుంది.
* లేత ఆముదపు ఆకులను, ఒక కర్పూరం బిళ్ళను మెత్తగా నూరి ఆసనానికి కడుతూ ఉంటే మూల వ్యాధి తగ్గిపోతుంది.
* స్త్రీలకు ఆగిన బహిష్టు మళ్ళీ రావాలంటే ఆముదపు ఆకును కొంచం నలగ్గొట్టి వేడి చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు పొత్తి కడుపుపై వేసి గుడ్డతో కట్టుకట్టి రాత్రి నుంచి ఉదయం దాకా ఉంచాలి. ఇలా చేస్తూ ఉంటే బహిష్టు మళ్ళీ వస్తుంది.
* ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో లేహ్యాన్ని తీసుకుంటూ ఉంటే వాతరోగం, పక్షవాతం తగ్గిపోతాయి.
* ఆముదపు ఆకులకు నువ్వెలా నూనెను పూసి, ఆకులను వేడి చేసి, వేడిగా ఉన్నప్పుడే కీళ్లపైన వేసి కట్టుకడుతూ ఉంటే కీళ్ల వాపులు, నొప్పులు తగ్గిపోతాయి.
* ఆముదపు పప్పును మెత్తగా నూరి వేడి చేసి, గోరు వెచ్చగా ఉన్నప్పుడు కీళ్ళపై వేసి కట్టు కడుతూ ఉంటే కీళ్ళ మంటలు తగ్గిపోతాయి.
* అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్ తగ్గాలంటే… పై బెరడు తీసేసిన ఆముదపు పప్పును మెత్తగా నూరి వెంట్రుకలను తీసి వేసిన చోట రుద్దుతూ ఉండాలి. ఇలా చేస్తే అన్ వాంటెడ్ హెయిర్ గ్రోత్ తగ్గుతుంది.
* సున్నపు తేటపై నీరు, ఆముదం రెండూ సమంగా తీసుకుని ఒక పాత్రలో వేసి గిలక్కొడితే అది వెన్నలాగా మారుతుంది. దానిని తీసుకుని కాలిన పుండ్లపై, బొబ్బలపై లేపనంలా రాస్తే అతి త్వరగా మాడిపోతాయి.

Related posts

బాలీవుడ్ హీరోహీరోయిన్లు తెలుగులో… వీడియో వైరల్

vimala p

“రూలర్” టీజర్… ఇక వేటే…!

vimala p

తెలుగు రాష్ట్రాలకు .. రెండు రోజుల వర్ష సూచన..

vimala p