telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

అమర్ నాథ్ యాత్రలో తెలుగు రుచులతో భోజనం

amarnath yatra

ఉత్తరాదిలోని అమర్ నాథ్ పుణ్యక్షేత్రానికి దేశం నలుమూలల నుంచి ప్రతిఏటా భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళుతుంటారు. భక్తుల కోసం భోజన సదుపాయాలు ఉన్నప్పటికీ అక్కడ దొరికేవన్నీ ఉత్తరాదికి చెందిన వంటకాలే అందుబాటులో ఉంటాయి. దీంతో తెలుగు భక్తులు అరకొరగా తినాల్సిన పరిస్థితి ఉండేది. ఈ నేపథ్యంలో అక్కడ అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆవిర్భవించింది.

2010లో తెలంగాణలోని సిద్ధిపేట నుంచి 45 తెలుగు కుటుంబాలు అమర్ నాథ్ యాత్రకు వెళ్లగా, అక్కడి బేస్ క్యాంపుల్లో తెలుగు భోజనం దొరక్క చాలా ఇబ్బంది పడ్డారు. దాంతో తమలాగా భక్తులెవ్వరు ఇబ్బంది పడకూడదని భావించి, 2011లో 21 మంది తెలుగు వ్యక్తులు అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఏర్పాటు చేశారు.

సమితి ఆధ్వర్యంలో తెలుగు రుచులతో కమ్మని భోజనం అందిస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు తెలుగు భోజనాలు వడ్డన చేస్తారు. దోసె, పూరీలు, ఇడ్లీలు, అన్నం, పప్పు, ,పచ్చళ్లు, కూరలు, పెరుగు, స్వీట్ల వరకు ఇక్కడి భోజనంలో నిత్యం వడ్డిస్తారు. బల్తాల్, పంచతరణి ప్రాంతాల్లో ఈ తెలుగు భోజన సేవలు అందిస్తున్నారు.

Related posts