సామాజిక

అమర్‌నాథ్‌ యాత్ర తేదీలు ఖరారు…

జూన్‌ 28 నుండి ప్రఖ్యాత అమర్‌నాథ్‌ యాత్ర ను ప్రారంభించనున్నట్లు దేవస్థాన బోర్డు అధికార ప్రతినిధి తెలిపారు. 60 రోజుల పాటు అమర్‌నాథ్‌ యాత్రకు ప్రజలను అనుమతించనున్నట్లు బోర్డు అధికార ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ ఎన్‌ఎన్‌ వోరా, బోర్డు ఛైర్మన్‌ బోర్డు సభ్యుల సమావేశంలో యాత్రకు సంభందించిన తేదీలను ఖరారు చేశారు.

యాత్ర తేదీల ఖరారుతో పాటు ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ హిమాలయాల్లోని దేవాలయ పరిసరాల్లో అందరూ నిశ్శబ్దం పాటించాలని ఇచ్చిన ఆదేశాల గురించి కూడా చర్చించినట్లు ప్రతినిధి తెలిపారు. ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలపై దేశ వ్యాప్తంగా భక్తులు నిరసనలు వ్యక్తం చేయడంతో కేవలం మంచు లింగం ముందుకు వెళ్లిన సమయంలో మాత్రం అందరూ నిశ్శబ్దంగా ఉండాలని, గుహలో మంత్ర ఉచ్చారణలు, భజనలపై ఎలాంటి నిబంధనలూ విధించడంలేదని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తెలిపింది.

Related posts

కాశ్మీర్ లో ఉగ్రవాదులు హతం..

admin

చోద్యం…

chandra sekkhar

నగరంలో కారు బీభత్సం… 6కిలోమీటర్లు దొరకకుండా.. అద్దాలు పగలగొట్టి స్టేషన్ లో

nagaraj chanti

Leave a Comment