telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

అమరావతి … ఎడ్యుకేషన్ హబ్ గా చేస్తాం.. : బొత్స 

minister bosta in vijayawada meeting

ఏపీ రాజధాని రైతుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లాండ్‌పూలింగ్‌లో తీసుకున్న భూములను అభివృద్ధి చేసి రైతులకు ఫ్లాట్ల రూపంలో ఇస్తామన్నారు. జీఎన్‌ రావు కమిటీ ఇచ్చిన నివేదికపై ఈనెల 27న కేబినెట్‌ భేటీలో చర్చించిన నిర్ణయం తీసుకుంటామని బొత్స తెలిపారు. నిపుణుల కమిటీ నివేదికతో ప్రభుత్వం ఏకీభవిస్తుందనే అనుకుంటున్నానని.. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. 

13 జిల్లాల అభివృద్ధికోసమే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన అని బొత్స తెలిపారు. అమరావతిని ఎడ్యుకేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతామని బొత్స స్పష్టం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రాజధానిలోని అసైన్డ్‌ భూముల గురించే మాట్లాడారని.. ఆ భూములను రైతులకే తిరిగి అప్పగిస్తామన్నారు. ప్రజల ప్రాధాన్యాలు తమకు ముఖ్యమని.. ఏ కొందరి ఉద్దేశాలు కాదన్నారు. ప్రజలకు మాత్రమే తాము జవాదారులమని.. ప్రతిపక్షానికి కాదని బొత్స వ్యాఖ్యానించారు.

Related posts