telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమ్మకు చెప్పే .. ఆ పాత్ర చేశాను .. : అమలాపాల్

nude hurdles to amalapal on aame movie

‘ఆమె’ చిత్రంతో అమలాపాల్ గొప్ప సాహసమే చేసింది. ఈ చిత్రం చాలా విభిన్నంగా కనిపిస్తోంది. రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రచార చిత్రాల్లో అమలాపాల్ నగ్నంగా కనిపించింది. ట్రైలర్‌లో తన సహనటి ఆర్జే రమ్యను ముద్దు పెట్టుకుంటూ కనిపించింది. ఇవి కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో ముద్దు సన్నివేశంపై మీడియా అమలాను ప్రశ్నించింది. దీనికి స్పందించిన అమల ఓ అమ్మాయిని మద్దు పెట్టుకోవడంలో తప్పేమీ లేదని, అది స్క్రిప్ట్‌లో లేదని, అనుకోకుండా తీసిన షాట్ అని తెలిపింది.

నగ్న సన్నివేశాల గురించి తన తల్లికి ముందే చెప్పానని, స్క్రిప్టుకు ఖచ్చితంగా అవసరమైతే నటించమని తన తల్లి చెప్పిందని అమల వెల్లడించింది. ఈ సినిమా శృంగార నేపథ్యంలో సాగేది కాదని, కంటెంట్ అర్థం కావాలంటే సినిమాను చూడాల్సిందేనని అమల తెలిపింది. ఈ చిత్రం నటిగా తనకు ఎంతో నమ్మకాన్నిచ్చిందని పేర్కొంది. తనకు ఎలాంటి సవాల్‌నైనా ఎదుర్కోగలననే నమ్మకం వచ్చిందని అమల స్పష్టం చేసింది.

Related posts