telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆమె” నుంచి మరో న్యూడ్ సీన్

Aame

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందించిన చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా టీజర్లో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది. ఈ చిత్రం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తుంది. “ఆమె” సినిమాకు మంచి టాక్ వ‌చ్చింది. తెలుగులో ఏమో కానీ త‌మిళ‌నాట మాత్రం ఈ చిత్రానికి మంచి వ‌సూళ్లు కూడా వ‌స్తున్నాయి. మ‌హిళా సాధికార‌త‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కించాడు ర‌త్న‌కుమార్. దీనికి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రంలో న‌గ్నంగా న‌టించింది అమ‌లా పాల్. ఇదే ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. టీజ‌ర్ విడుద‌లైన‌పుడే సినిమాపై ఆస‌క్తి పెరిగిపోయింది. సినిమా విడుద‌లైన త‌ర్వాత మ‌రింత ర‌చ్చ పెరిగిపోయింది.

సినిమాను ఆపేయాల‌ని.. ఇలాంటి సినిమాల‌ వ‌ల్ల యువ‌త చెడిపోతుంద‌ని కొంద‌రు ఆప‌డానికి ప్ర‌య‌త్నించినా కూడా ఇప్పుడు విడుద‌లైన త‌ర్వాత అంతా ప్ర‌శంశిస్తున్నారు. న‌గ్నత్వం ఉన్నా ఉన్నా కూడా ఎక్క‌డా అస‌భ్యంగా మాత్రం తెర‌కెక్కించ‌లేదు ద‌ర్శ‌కుడు ర‌త్న కుమార్. అమ్మాయిల వ‌స్త్ర‌ధార‌ణ‌తో పాటు ఇంకా చాలా విష‌యాల‌ను ఈ చిత్రంలో చ‌ర్చించాడు ద‌ర్శ‌కుడు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి మ‌రో న్యూడ్ సీన్ విడుద‌లైంది. దీన్ని త‌న ట్విట్ట‌ర్లో పోస్ట్ చేసింది అమ‌లా పాల్. పేప‌ర్ మీద ఇది న్యూడిటీ ఉండొచ్చు కానీ న‌టిస్తున్న‌పుడు మాత్రం చాలా ఆస‌క్తి అనిపించింది అంటూ ట్వీట్ చేసింది అమలా పాల్. మొత్తానికి ఈ న్యూడ్ సీన్స్ చూసిన త‌ర్వాత సినిమాకు మ‌రింత ప్ర‌మోష‌న్ వ‌స్తుంద‌ని న‌మ్ముతుంది ఈ ముద్దుగుమ్మ‌.

Related posts