telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నగ్నంగా ఎలా నటించానంటే… అమలాపాల్

Amalapaul

రత్నకుమార్ దర్శకత్వంలో అమలాపాల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం “ఆమె”. తమిళంలో “ఆడై” టైటిల్ తో చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను వీ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తుండగా చరిత చిత్ర, తమ్మారెడ్డి భరద్వాజలు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదలవ్వగా అందులో నగ్నంగా కన్పించి అందరికీ షాకిచ్చింది అమలాపాల్. ఇక టీజర్ విషయానికొస్తే ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతూ వీక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రముఖులు సైతం సినిమా టీజర్ పై ప్రశంసలు కురిపించారు. టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే మిలియన్ల వ్యూస్ రాబట్టింది. తాజాగా ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఇందులో అమలాపాల్ మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ లిప్ లాక్ చేస్తూ చాలా బోల్డ్ గా కనిపించింది.

అయితే అమలాపాల్ తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగ్నంగా ఎలా నటించారో వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ “న్యూడ్ సీన్ సందర్భంగా ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని ధరించడంపై దర్శకుడు రత్నకుమార్ నాతో చర్చించారని, అయితే కంగారు పడాల్సిన పని లేదని తాను ఆయనకు చెప్పానని, ఆ సన్నివేశాన్ని చిత్రీకరించే రోజున తాను చాలా టెన్షన్ కు గురయ్యానని, సెట్స్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠకు గురయ్యానని, సెట్స్ లో ఎవరెవరు ఉంటారు? తనకు రక్షణ ఉంటుందా? అని కంగారు పడ్డానని చెప్పింది. అయితే చాలా క్లోజ్డ్ సెట్ ను దర్శకుడు ఏర్పాటు చేశారని… కేవలం 15 మంది మాత్రమే సెట్స్ లో ఉన్నారని అమలాపాల్ తెలిపింది. క్రూ సభ్యులపై నమ్మకం లేకపోతే తాను ఆ సన్నివేశాన్ని చేయలేకపోయేదాన్నని తెలిపింది.

Related posts