telugu navyamedia
తెలంగాణ వార్తలు

నాకు ఎలాంటి ఈడీ నోటీసులు రాలేదు – ఎమ్మెల్సీ క‌విత‌

తనకు ఎలాంటి నోటీసులు రాలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఆమె నుంచి నోటీసులు అందాయని జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు .

ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. నిజనిర్ధారణ తర్వాతే వార్తలు వేయాలి రాయాలని చెప్పారు. మీ విలువైన సమయాన్ని వాస్తవాలు తెలిపేందుకు వాడాలని  మీడియా సంస్థలను ఎమ్మెల్సీ కవిత అభ్యర్థించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం విషయమై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు ఇచ్చినట్టుగా కొన్ని మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. కరోనాతో ఎమ్మెల్సీ కవిత క్వారంటైన్ లో ఉన్నారు.

కాగా..ఢిల్లీ లిక్కర్ స్కాం దాడుల్లో భాగంగా హైద‌రాబాద్‌లోని పలువురు వ్యాపార వేత్తలు , ఓ చార్టెడ్ అకౌంట్ నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. 25 బృందాలతో ఈడీ తనిఖీలు చేపట్టింది గోరంట్ల అసోసియేట్స్‌ కార్యాలయంలో సోదాలు చేశారు.

దోమలగూడ అరవింద్‌నగర్‌లోని.. సాయికృష్ణ రెసిడెన్సీలో ఉంది గోరంట్ల అసోసియేట్స్. గోరంట్ల బుచ్చిబాబు కొందరు ప్రముఖులకు ఆడిటర్‌గా ఉన్నారు. చార్టెడ్ అకౌంట్‌కు సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

Related posts