telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

1 మిలియన్ లాస్ లో “సైరా” ?

Syeraa

సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై మెగాస్టార్ చిరంజీవి తొలి చారిత్రక చిత్రం “సైరా నరసింహారెడ్డి” వెండితెరపై ప్రేక్షకులను మెప్పిస్తోంది. రామ్ చరణ్ నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ప్రపంచ వ్యాప్తంగా 5 భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా అమితాబ్‌, కిచ్చా సుదీప్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతార లాంటి భారీ తారాగణంతో రూపొందించారు. తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన “సైరా” చిత్రాన్ని దేశ వ్యాప్తంగా అన్ని భాషల వాళ్లూ ఆదరిస్తూ సినిమాను విజయవంతం చేశారు.అయితే యూఎస్ లో “సైరా” ను 3.3 మిలియన్ డాలర్లకు అమ్మితే ఇప్పటివరకూ వసూలయింది 2.2 మిలియన్ మాత్రమేనని తాజా సమాచారం. లాభాల సంగతి పక్కన పెడితే బ్రేక్ ఈవెన్ మార్క్ చేరేందుకు ఇంకా 1.1 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి. అయితే ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ట్రెండ్ ను బట్టి చూస్తే సాధ్యమేనా అని అనుమానాలు కలుగుతున్నాయి. ఇప్పటికే వారం రోజుల థియేట్రికల్ రన్ కంప్లీటయింది గనక ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఏమాత్రం లేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సైరా కు యూఎస్ లో దాదాపు 1 మిలియన్ డాలర్ల నష్టం తప్పేలా లేదని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాదిలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ యూఎస్ డిస్ట్రిబ్యూటర్లకు నిజంగా లాభాలు తీసుకొచ్చిన సినిమాలను వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. 95% పైగా సినిమాలు డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలే మిగిలిస్తున్నాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి “సైరా” సినిమా కూడా అదే లిస్టులో చేరేలా ఉందని ట్రేడ్ వర్గాల సమాచారం.

Related posts