• Home
  • వార్తలు
  • హైపర్ టెన్షన్ కి…బాదం తో చెక్…పెట్టండి…
Trending Today ఆరోగ్య వార్తలు ఆరోగ్య వార్తలు వార్తలు సామాజిక

హైపర్ టెన్షన్ కి…బాదం తో చెక్…పెట్టండి…

almond controls hyper tension

నేటి హడావుడి జీవితంలో అనేక టెన్షన్ లతో రోజును గడిపేస్తున్న వారు కోకొల్లలు. వీరందరూ అనేక మందులు వాడుతూ సంపాదించిందంతా వైద్యానికే ఖర్చు చేస్తున్నారు గాని, పౌష్ఠిక ఆహరం పట్ల కనీస పరిజ్ఞానం పెంచుకొని దానికి అనుగుణంగా ఆహార అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వచ్చే ప్రయోజనమే వేరు. కానీ తీరిక లేదు అనే సాకు అడ్డుగా పెట్టుకొని ఏదో ఒక రకం మందుతో కాలం గడిపేస్తున్నారు.

జీవితం మొత్తం ప్రణాళిక బద్దంగా గడుపుతాం కానీ ఒక్క ఆహార విషయంలో కూడా అదేవిధంగా మారలేకపోతున్నాం.. అదే ఒకరోజు కొంప ముంచే రోగాలను హఠాత్తుగా తీసుకొస్తుంది. దీనితో సర్వం తలకిందులైపోతుంది. అప్పటిదాకా పరిస్థితులు తెచ్చుకోవటం కంటే ముందే కాసింత ఓపికతో ఆహారపద్ధతులను కూడా ప్రణాళిక వేసుకుంటే .. ఏదో సాధారణ చెక్ అప్ కోసం వైద్యుడి వద్దకు వెళ్ళవచ్చు.. అంతేగాని అనారోగ్యంతో వెళ్లే పరిస్థితి రాదు.

ఉదయాన్నే నానబెట్టిన బాదాం పప్పును ఇంటిల్లిపాది తీసుకోవటం వలన చాలా వరకు అన్ని పోషకాలు అంది రోజు అంతా ఉత్సహంగా ఉంటుంది. అలాగే రోజువారీ పనులన్నీ చేసుకునే శక్తీ కూడా లభిస్తుంది. ముఖ్యంగా బాదాం తీసుకోవటం వలన హైపర్ టెన్షన్ నుండి మనం దూరంగా ఉండవచ్చు. అలాగే శరీర ఒత్తిడి, అలసట తొలగిపోతుంది. ఇవన్నీ ఏదో చెప్తున్నట్టు కాదు, మీరే కొన్నాళ్ళు ఈ నియమాన్ని పాటించి పరిశీలించుకోండి. మీలో మీకే మార్పు తెలుస్తుంది. ఇంకా బాదాం వలన శరీరంలో ఇనుము నిల్వలు సరిగా ఉండటం జరుగుతుంది. ఇది ముఖ్యంగా స్త్రీలకు అన్ని వయసుల వారికి మంచిది. శరీరంలో ఇనుము లోపం ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

బాదాం వలన శరీర కండరాలు ఉత్సహాన్ని పుంజుకొని రోజువారీ పనులు చేసుకునేందుకు దోహదం చేస్తుంది. ఇలాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్న ఈ ఒక్క పదార్దాన్ని ఆహారంలో ముఖ్యంగా ఉదయం అల్పాహారాన్ని ముందు తీసుకుంటే చాలా మంచిది.

Related posts

దాతీ మహరాజ్‌పై లైంగిక దాడి కేసు… అరెస్ట్‌ చేయడంలో విఫలమైన పోలీసులు

jithu j

జనవరి 31న ఆలయం మూసివేత…

admin

తెలంగాణకు కేంద్రం షాక్..విడుదల చేసిన 190 కోట్లు వెనక్కి!

madhu

Leave a Comment