telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“వెంకీ మామ” టీజర్ వచ్చేసింది… నాగ చైతన్య పుట్టినరోజు గిఫ్ట్

Venky-Mama

అక్కినేని నాగ చైత‌న్య మంచి కథలను ఎంచుకుంటూ వరుసగా హిట్ సినిమాలతో ముందుకు వెళ్తున్నారు. ప్ర‌స్తుతం త‌న మామ వెంక‌టేష్‌తో క‌లిసి “వెంకీమామ” చేస్తున్నాడు. కె.ఎస్‌.ర‌వీంద్ర ద‌ర్శ‌కుడు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై డి.సురేష్‌బాబు, టీజీ విశ్వ‌ప్ర‌సాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెంకీ స‌ర‌స‌న పాయ‌ల్ రాజ్‌పుత్‌, నాగ‌చైత‌న్య స‌ర‌స‌న రాశీఖ‌న్నా హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా నాగ చైతన్య పుట్టినరోజున ఈ చిత్రబృందం నాగ చైతన్యకు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ లో కార్తీక్ శివరామ్ వీరమాచినేని అనే పేరుతో మిలిటరీ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు. కాగా నాగచైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి “లవ్ స్టోరీ” అనే టైటిల్ వినిపిస్తుండగా… ఇందులో చైతూకు జోడిగా సాయి పల్లవి నటిస్తోంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను ఈరోజు చైతన్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా “వెంకీ మామ” నుంచి టీజర్ విడుదలైంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.

Related posts