telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘అల వైకుంఠపురములో’ ఆల్ టైం రికార్డు…!

AY

ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలోని పాటలకు వచ్చిన ప్రేక్షకాదరణ అంతా ఇంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాలోని పాటలు ఆదరణ పొందడం విశేషం. ఇంకా ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్న ఈ సినిమా తాజాగా మరో ఆల్ టైం రికార్డు ను సొంతం చేసుకుంది. వెండితెర పై సూపర్ హిట్ అయిన ఈ సినిమాకు టీవీలో కూడా అదే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు రాని టీఆర్పీ ని ఈ సినిమా దక్కించుకుంది. ఆ విషయాన్ని గీత ఆర్ట్స్ తమ ట్విట్టర్ వేదికగా తెలిపింది. “ఈ సినిమా 7 నెలల కింద థియేట్రికల్ గా, 6 నెలల కింద ఓటీటీ లో విడుదల అయ్యింది. అయిన ఇప్పటికీ అల వైకుంఠపురములో ఎప్పుడు ఏ తెలుగు సినిమాకూ రాని రికార్డ్ బ్రేకింగ్ హైయెస్ట్ టీఆర్పీ – 29.4 ని సొంతం చేసుకుంది. ఇటువంటి అద్భుతమైన మీ ప్రతిస్పందన మరియు ప్రేమకు ధన్యవాదాలు” అని తెలిపింది.

Related posts