telugu navyamedia
సినిమా వార్తలు

బన్నీ క్యారవాన్ విలువ 7 కోట్లు

allu arjun

టాలీవుడ్ స్టార్ హీరో, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఏం చేసినా స్టైల్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఫిలిం నగర్ మొత్తం ఆయన కొత్త క్యారవాన్ గురించే టాక్. కొంతకాలం క్రితం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు 3 నుంచి 4 కోట్లు వెచ్చించి ఖరీదైన క్యారవాన్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ అంతకన్నా సౌకర్యవంతమైన, విలాసవంతమైన, సౌకర్యవంతమైన క్యారవాన్ ను కొనుగోలు చేస్తున్నారు. 3 కోట్లు పెట్టి క్యారవాన్ ను కొన్న ఈ హీరో మరో 4 కోట్లతో దానిని అన్ని రకాల హంగులతో విలాసవంతంగా తయారు చేయించుకుంటున్నాడట. ప్రస్తుతం ముంబైలో తయారవుతున్న ఈ క్యారవాన్ త్వరలోనే హైదరాబాద్ కు రానుందట. ప్రస్తుతం త్రివిక్రమ్ తో సెట్స్ పైకి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే ఈ సినిమా కోసం బరువు తగ్గాడు కూడా. ఇక సుకుమార్ దర్శకత్వంలో కూడా సినిమాను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు అల్లు అర్జున్.

Related posts