సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ తీస్తున్న కొత్త సినిమా ‘పుష్ప’. సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పతాకాలపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో పాన్ ఇండియా చిత్రంగా సినిమా తెరకెక్కనుంది. ఇందులో రష్మిక బన్నీకి జంటగా నటిస్తోంది. విజయ్ సేతుపతి విలన్ క్యారెక్టర్‌గా అలరించనున్నారు. ఈ చిత్ర యూనిట్‌లోని ఇన్‌సైడర్స్ ద్వారా సినిమా లైన్ దాదాపుగా లీక్ అయ్యింది. వాళ్ళు అందించిన వివరాల ప్రకారం ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌లో చూపించినట్టుగానే శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సినిమా ఉంటుంది. అక్కడ అల్లు అర్జున్.. రాజు అనే పేరుతో పరిచయం అవుతారట. రాజు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే ఒక గ్రూప్‌కి సపోర్ట్‌గా ఉంటాడట. మిగిలిన స్మగ్లింగ్ గ్రూప్స్‌ని అడ్డుకుంటూ అక్కడ లోకల్ పొలిటీషియన్స్‌కి దగ్గర అవుతాడట. ఈ నేపథ్యంలో అక్కడ అల్లు అర్జున్‌కి పరిచయం అయ్యే హీరోయిన్ పేరు పుష్ప. అదే పేరు రాజు తన లారీకి పెట్టుకుంటాడట. ఈ సినిమాలో బన్నీలో రెండో షేడ్ ఉంటుందట. ఈ కథ ఫారెన్ బ్యాక్ డ్రాప్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అక్కడ బన్నీ పేరు పుష్పక్ నారాయణ్ అట. అక్కడ ఒక స్టైలిష్ బిజినెస్ మ్యాన్‌గా కనిపిస్తాడట బన్నీ. అలాగే, మూడో షేడ్ సినిమాకి హార్ట్ లాంటిది అని అంటున్నారు. ఈ షేడ్‌లో బన్నీ ఒక ఇన్వెస్టిగేషన్ లేదా ఒక స్పెషల్ ఆఫీసర్‌గా కనిపిస్తారట. ఇలా ‘పుష్ప’లో మొత్తం మూడు షేడ్స్‌లో బన్నీ కనిపిస్తారట. మూడు షేడ్స్ ఉన్నా బన్నీ సోలో రోల్‌లోనే ఉంటారని సమాచారం.
previous post