telugu navyamedia
telugu cinema news trending

కొరటాల దర్శకత్వంలో అల్లు అర్జున్ ?

Koratala

కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘ఆచార్య’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత కొరటాల ఎవరితో సినిమా చేయనున్నాడన్నది ఆసక్తి కలిగిస్తుంది. కాగా ఆయన అల్లు అర్జున్ తో సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని ఫిలిం నగర్ లో టాక్ వినిపిస్తుంది. మరోవైపు అల్లు అర్జున్ వరుసగా ప్రాజెక్టులను లైన్ లో పెడుతున్నాడు . రేసుగుర్రం దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. అలాగే త్రివిక్రమ్ తో ఓ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడట. అల్లు అర్జున్ సుకుమార్ తో ప్రస్తుతం `పుష్ప` సినిమా చేస్తున్నాడు. ఇక కొరటాల ఇటీవల బన్నీకి ఓ లైన్ వినిపించాడని తెలుస్తుంది. లైన్ నచ్చడంతో బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, కొరటాల ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయాలని చూస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.

Related posts

సూప‌ర్ హీరో  `ష‌జామ్‌`..

vimala p

హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచులు లేకపోవడానికి అసలు కారణం ఇదే..!

Vasishta Reddy

అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా… రామ్ గోపాల్ వర్మ సంచలన వర్మ

vimala p