telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నిహారిక నిశ్చితార్థ వేడుకలో స్టైలిష్ లుక్ లో బన్నీ

AA

మెగా వారింట పెళ్లి సందడి స్టార్ట్ అయింది. మెగా డాటర్, నాగబాబు కుమార్తె నిహారిక నిశ్చితార్ధ వేడుకను ఆగస్టు 13 (గురువారం) సాయంత్రం కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా నిర్వహించారు. మెగాఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో సందడి చేసింది. నిశ్చితార్థ వేడుకలో బన్ని కనిపించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. బన్ని టాప్ టు బాటమ్ బ్లాక్ అండ్ బ్లాక్ లో కనిపించాడు. గడ్డం, మెలి తిప్పిన మీసకట్టు, గిరజాల జుత్తుతో ఎంతో స్లిమ్ లుక్ కి మారిపోయి సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. ఇది నిజంగానే అభిమానులకు సర్ ప్రైజ్ ట్రీట్ అనే చెప్పాలి. కాగా కరోనా ఎఫెక్ట్ తగ్గిన తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ ‘పుష్ప’ అనే సినిమా చేయనున్న సంగతి తెలిసిందే.

Related posts