మెగా హీరోలంతా కలిసి ఉన్న చిన్నప్పటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగా హీరో వరుణ్ తేజ్ త్రోబ్యాక్ ఫోటో అని ఓ పిక్ షేర్ చేశారు. ఈ ఫోటోలో వరుణ్ తేజ్‌తో పాటు రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, సుష్మిత కొణిదెల ఉన్నారు. ఈ పోస్ట్‌కు ‘మేజర్ త్రోబ్యాక్’ అని వరుణ్ తేజ్ క్యాప్షన్ పెట్టారు. ఈ పిక్‌లో తమ హీరోలని చూసుకొని అభిమానులు తెగ షేర్ చేసేస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అల్లు అర్జున్ తన సోషల్ మీడియా పేజ్‌లో అల్లు రామలింగయ్య పద్మశ్రీ అవార్డు తీసుకుని హైదరాబాద్ వచ్చినప్పుడు విమానాశ్రయంలో దిగిన ఫోటోని షేర్ చేశాడు. ఇందులో అల్లు రామలింగయ్య దంపతులతో పాటు ప్రస్తుత మెగా హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, శిరీష్ ఉన్నారు. అల్లు అర్జున్ అన్నయ్య వెంకటేష్ (బాబీ), రామ్ చరణ్ సోదరి సుష్మిత కొణిదెల కూడా ఈ ఫొటోలో ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ ఆర్ఆఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉంటే, అల్లు అర్జున్.. అల వైకుంఠపురములో సినిమా చేస్తున్నాడు. ఇక సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతి రోజూ పండగే డిసెంబర్‌లో విడుదల కానుంది. ‘సోలో బ్రతుకే సో బెటర్’ అనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇక వరుణ్ తేజ్ బాక్సర్ నేపథ్యంలో తెరకెక్కే చిత్రంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు.
Major throwback!!🤗 pic.twitter.com/ZFHPBuRk8R
— Varun Tej Konidela 🥊 (@IAmVarunTej) 22 November 2019
టీఆర్ఎస్ కు ప్రచారం చేస్తానంటున్న రేవంత్ రెడ్డి…