telugu navyamedia
సినిమా వార్తలు

అల్లు అర్జున్, దిల్ రాజు “ఐకాన్… కనబడుట లేదు”

Icon

అల్లు అర్జున్ సినిమా గురించి అభిమానులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు కొత్త సినిమా టైటిల్ ను ప్రకటించారు. దిల్ రాజు నిర్మాణంలో “ఎంసీఏ” ఫేమ్ శ్రీరామ్ వేణు దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి “ఐకాన్” అనే టైటిల్ ను ప్రకటించారు. “కనబడుటలేదు” అనేది ట్యాగ్ లైన్. టైటిల్ ను ప్రకటించగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ టైటిల్, ట్యాగ్ లైన్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయని అంటున్నారు. ఇక దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కథ చాలా కొత్తగా ఉండడంతో నిర్మాత దిల్ రాజు ఫిదా అయ్యారట. ఈ సినిమా అల్లు అర్జున్ కు తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ ను ఇస్తుందని భావిస్తున్నారట. ఇంతకుముందు దిల్ రాజు, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ఆర్య, పరుగు, దువ్వాడ జగన్నాథం సినిమాలు మంచి హిట్ ను అందుకున్న విషయం తెలిసిందే.

“నా పేరు సూర్య” సినిమాతో భారీ డిజాస్టర్ ను చవిచూసిన అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని, ఇప్పుడు వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టేశాడు. ఈ నెలాఖరున త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించబోయే సినిమా ప్రారంభం కానుంది. త్వరలోనే సుకుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండనుంది. ఇప్పుడు టైటిల్ ప్రకటించిన సినిమాతో కలిపి మొత్తం మూడు సినిమాలన్నమాట. ఇక అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలెబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Related posts