telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ కొత్త కారు “బీస్ట్” చూశారా ?

Allu-Arjun

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 19వ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఏఏ19గా తెరకెక్కుతున్న ఈ చిత్ర టైటిల్‌ను ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా “అల.. వైకుంఠపురములో” అంటూ ప్రకటించింది చిత్రబృందం. హారికా హాసినీ, గీతా ఆర్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు. వ‌చ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీగా రూపొందుతున్న‌ ఈ చిత్రంలో సుశాంత్‌, నివేదా పేతురాజ్ కీలక పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇక ఈ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ రూపొందించనున్న “ఐకాన్” సినిమాలో నటించేందుకు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హీరోయిన్ కోసం చిత్రబృందం అన్వేషణ సాగిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్‌ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోంది. ఇదిలా ఉండగా… సోషల్ మీడియాలో బన్నీ అభిమానులతో చేరువగా ఉంటాడు. అత్యధిక ఫాలోవర్స్ కలిగిన స్టార్లలో బన్నీ ఒకడు. తాజాగా బన్నీ ఓ ట్వీట్ చేస్తూ తాను కొత్త కారు కొన్న విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కొత్త రేంజ్ రోవర్ కారుని బన్నీ కొన్నాడు. “మా ఇంట్లోకి కొత్త కారు వచ్చింది. దానికి నేను ‘బీస్ట్’ అని పేరు పెట్టా. నేను ఏ వస్తువు కొన్నా దానిని కృతజ్ఞతగానే భావిస్తా” అని బన్నీ ట్వీట్ చేశాడు.

Related posts