• Home
  • Trending Today
  • త్రివిక్రమ్, అల్లు అర్జున్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్…?
Trending Today సినిమా వార్తలు

త్రివిక్రమ్, అల్లు అర్జున్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్…?

Allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు ఎప్పుడు ప్రకటిస్తాడు… అసలు ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడు ? కథ, కథనం ఏంటి ? అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత మేలో “నా పేరు సూర్య‌.. నా ఇల్లు ఇండియా” అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. కానీ ఆ సినిమా అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక ఆ తర్వాత సినిమాపై బన్నీ ఇంతవర‌కు క్లారిటీ ఇవ్వ‌లేదు. ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని, లేదు త్రివిక్రమ్ తో సినిమా చేయనున్నాడని చాలా పుకార్లు షికార్లు చేశాయి.

అయితే తాజాగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన “అర‌వింద స‌మేత వీర రాఘవ” చిత్రం అక్టోబరు 11వ తేదీ గురువారం విడుదలైన విషయం తెల్సిందే. ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ తో విజయవంతగా దూసుకెళ్తోంది. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ కూడా స్పెష‌ల్ స్క్రీనింగ్‌లో వీక్షించాడట. ఈ చిత్రం నచ్చడంతో త్రివిక్రమ్‌కు బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కే చిత్రం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వరిలో సెట్స్ పైకి వెళుతుందట. చిత్రాన్ని వచ్చే ద‌స‌రాకి విడుదల చేయాలని భావిస్తున్నారట. బ‌న్నీ, త్రివిక్ర‌మ్ ప్రాజెక్ట్‌పై త్వ‌ర‌లోనే అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Related posts

పెయిన్ కిల్లర్ వాడుతున్నారా…గుండె జర బద్రం..

chandra sekkhar

“సైరా”పై రామ్ చరణ్ అసహనం… టీంకు గట్టి వార్నింగ్…!?

vimala t

మళయాళ నటుడు కొల్లం అజిత్ మృతి

admin

Leave a Comment