telugu navyamedia
telugu cinema news

మహేష్ బాబు బాటలో అల్లు అర్జున్

Allu-Arjun

టాలీవుడ్ లో హీరోలు సినిమాలపైనే కాకుండా ఇతర బిజినెస్ లపై కూడా ఆసక్తిని కనబరుస్తున్నారు. తాజాగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మల్టిప్లెక్స్ బిజినెస్ లోకి అడుగు పెడుతున్నాడనే వార్తలు వైరల్ గా మారాయి. ఇప్పటికే అల్లు అర్జున్ ఓ రెస్టారెంట్ తో పాటు పలు వ్యాపార రంగాల్లో రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు అమీర్ పేట్ లోని సత్యం థియేటర్ ని మల్టిప్లెక్స్ గా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిటీలో అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే సత్యం థియేటర్ ఇప్పుడు బాగా పాతబడిపోయింది. ఇతర ప్రాంతాల్లో చాలా వరకు మల్టిప్లెక్స్ థియేటర్లు రావడంతో ఇప్పుడు ప్రేక్షకులు సత్యం థియేటర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే ఆ థియేటర్ పై బన్నీ కన్ను పడిందట. ఆ థియేటర్ స్థానాల్లో మల్టిప్లెక్స్ నిర్మించాలన్నది అల్లు అర్జున్ ప్లాన్. అయితే ఈ విషయంపై బన్నీ ఇప్పటివరకు స్పందించలేదు.

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఏషియన్ ఫిల్మ్స్ సంస్థతో కలిసి “ఏఎంబి సినిమాస్” పేరుతో ఓ మల్టిప్లెక్స్ ను నిర్మించి, తన తండ్రి చేతుల మీదుగా ఇటీవలే ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు బన్నీ కూడా మహేష్ బాట పట్టనున్నాడన్నమాట.

Related posts

ఒకే స్టేజ్ పై ఇద్దరు ఖాన్ లు… అంబరాన్నంటిన సంబరం

vimala p

“మారి-2” ట్రైలర్ : ఇఫ్ యూ ఆర్ బ్యాడ్… ఐయామ్ యువర్ డాడ్…

vimala p

బాలకృష్ణ పై షాకింగ్ కామెంట్స్ …. హీరో నాగబాబు 

ashok