telugu navyamedia
telugu cinema news trending

బాడీగార్డ్ బర్త్ డే సెలబ్రేట్ చేసిన అల్లు అర్జున్

alluarjun

అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో బన్నీ లారీ డ్రైవర్ పాత్రలో టించబోతున్నాడని తెలుస్తుంది. ఇదిలా ఉంటే అంత పెద్ద స్టార్ హీరో అయినా కూడా బన్నీ చేస్తున్న కొన్ని పనులు మాత్రం అభిమానులకు బాగా నచ్చేస్తున్నాయి. ముఖ్యంగా ఆయన తన పర్సనల్ స్టాఫ్‌ను చూసుకునే తీరు కూడా అద్భుతంగా ఉంటుంది. తన దగ్గర పని చేసే పర్సనల్ బాడీగార్డ్ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిపాడు బన్నీ. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈయన పుట్టిన రోజు వేడుకల్లో బన్నీ పాల్గొన్నాడు.. దాంతో సుకుమార్ సినిమా లుక్ బయటికి వచ్చేసింది. ఈ సినిమా కోసం తనను తాను చాలా మార్చుకున్నాడు బన్నీ. ముఖ్యంగా గడ్డం పెంచేసి కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. ఈ పుట్టిన రోజు వేడుకలలో పాల్గొనగా ఆయన లుక్ బయటికి వచ్చింది. పెరిగిన జుట్టు.. గుబురు గెడ్డంతో వైవిధ్యంగా కనిపిస్తున్నాడు బన్నీ. సుకుమార్ రంగస్థలంలో రామ్ చరణ్ మాదిరి ఈ సినిమాలో కనిపిస్తున్నాడు అల్లు అర్జున్.

Related posts

16 ఏళ్ల కుర్రాడు యూట్యూబ్ చూసి లక్షాధికారిగా మారాడు

vimala p

ఉపాసన “వాలంటైన్స్ డే” ట్వీట్ వైరల్

vimala p

సినిమా షూటింగ్ లో సిలిండర్‌ పేలి తల్లీకూతుళ్లు మృతి

vimala p