telugu navyamedia
telugu cinema news trending

మహేష్ బాబు రికార్డులను దాటేసిన అల్లు అర్జున్

AY

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన చిత్రం “అల వైకుంఠ‌పుర‌ములో”. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 12న విడుద‌లైన ఈ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ తెర‌కెక్కించారు. జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి చిత్రాల త‌ర్వాత వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రూపొందిన చిత్రం కావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే సినిమా మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతుంది. రూ.200 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. లేటెస్ట్ స‌మాచారం మేర‌కు ఓవ‌ర్‌సీస్‌లోనూ సినిమా రికార్డ్ క‌లెక్ష‌న్స్‌ను రాబ‌డుతుందని సినీ వ‌ర్గాలు చెబుతున్నాయి. యు.ఎస్‌లో ఈ సినిమా ఇప్ప‌టి వ‌ర‌కు $3,420,402 వ‌సూళ్ల‌ను సాధించింది. దీంతో మహేష్ బాబు `భ‌ర‌త్ అనే నేను` సినిమా పేరిట ఉన్న ఓవ‌ర్‌సీస్ నాన్ బాహుబ‌లి రికార్డుల‌ను ఈ సినిమా అధిగ‌మించి నాలుగో స్థానంలో నిలిచిన‌ట్లు స‌మాచారం. `బాహుబ‌లి 2`, `బాహుబ‌లి ది బిగినింగ్‌`, `రంగ‌స్థ‌లం` చిత్రాల త‌ర్వాత స్థానంలో `అల వైకుంఠ‌పుర‌ములో` సినిమా నిలవడం విశేషం.

Related posts

ఓ వార్త కోసం తన ఫొటోను వాడుకున్నారు … చర్యలు తీసుకోండి

vimala p

ఎల‌క్ట్రిక్‌ సైకిల్ తో నిఖిల్…!

vimala p

బీజేపీ ప్రజా సమస్యలను ద్రుష్టి మళ్లించే.. రాజకీయాలు చేస్తుంది.. : సిపిఎం

vimala p