telugu navyamedia
సినిమా వార్తలు

“బ్రోచేవారెవరురా” టీంపై బన్నీ ప్రశంసలు

Allu-Arjun

శ్రీవిష్ణు, నివేదా థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం “బ్రోచేవారెవ‌రురా”. “చలనమే చిత్రము..చిత్ర‌మే చ‌ల‌న‌ము” అనేది ఈ చిత్రానికి ఉప‌శీర్షిక‌. సత్యదేవ్, నివేతా పేతురాజ్, రాహుల్ రామక్రిష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించారు. జూన్ 28న విడుదలైన ఈ చిత్రం హిలేరియస్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని చూసిన బన్నీ చిత్రయూనిట్‌ పై ప్రశంసల జల్లు కురిపించారు. “బ్రోచేవారెవరురా చిత్రాన్ని చూశాను. ఇది చివరి వరకు థ్రిల్లింగ్‌గా సాగే హాస్య చిత్రం. ఈ చిత్రంలో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు, డైరెక్టర్‌కు నా అభినందనలు. శ్రీవిష్ణు ఎల్లప్పుడూ మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అతని ప్రయత్నాలు నిజంగా అభినందించదగినవి. నివేదా థామస్, వివేక్ ఆత్రేయకు ప్రత్యేక అభినందనలు” అని బన్నీ ట్వీట్‌లో చేశారు. ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ “ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ”పై కూడా అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

Related posts