telugu navyamedia
Uncategorized ట్రెండింగ్ సినిమా వార్తలు

అల్లు అర్జున్ లేకుండానే సుకుమార్ మూవీ షూటింగ్ ప్రారంభం

Allu-Arjun

ప్ర‌స్తుతం అల్లు అర్జున్… త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో “అల వైకుంఠపురంలో” సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తరువాత అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో సినిమా రూపొందనుంది. `రంగస్థలం` వంటి బ్లాక్‌బస్టర్ విజయం అందించిన తర్వాత కూడా స్టార్ డైరెక్టర్ సుకుమార్ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. `రంగస్థలం` తర్వాత సూపర్‌స్టార్ మహేష్‌తో సినిమా చేయాలని సుకుమార్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే మహేష్‌తో అభిప్రాయ భేదాల కారణంగా ఆ సినిమా వర్కవుట్ కాలేదు. ప్రస్తుతం స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయబోతున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న `అల వైకుంఠపురములో..` సినిమాతో అల్లు అర్జున్ బిజీగా ఉండడం వల్ల ఇప్పటివరకు సుకుమార్ సినిమా షూటింగ్ ప్రారంభం కాలేదు. శేషాచలం కొండల్లో స్మగ్లింగ్ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో బన్నీ సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడట. `అల వైకుంఠపురములో..` సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ ఈ కొత్త లుక్ కోసం బన్నీ శ్రమిస్తున్నాడట. దాంతో ఇప్పట్లో బన్నీ షూటింగ్‌కు హాజరుకాలేడని సమాచారం. బన్నీ లేకపోయినప్పటికీ కేరళలో బుధవారం నుంచి షూటింగ్ ప్రారంభించాలని సుకుమార్ భావిస్తున్నాడట. హీరో ప్రమేయం లేని ఒక యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తాడట. కొన్ని రోజుల తర్వాత బన్నీ జాయిన్ అవుతాడట.

Related posts