telugu navyamedia
సినిమా వార్తలు

ఎంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్… తండ్రి డైలాగ్ తో ఆకట్టుకుంటున్న అల్లు అర్జున్ తనయ

AY

ఓ వైపు సినిమాలు చేస్తూనే… మరోవైపు కుటుంబంతో కూడా బిజీగా ఉన్నాడు. షూటింగ్స్‌తో అలిసిపోయిన బన్నీ.. ఇంట్లో పిల్ల‌ల‌తో ఆడుకుంటున్నాడు. ఇప్పుడు కూడా బ‌న్నీ త‌న కూతురుపై ఆడుకుంటున్న వీడియో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. మొన్నటికి మొన్న డోన్ట్ కిల్ సో మెనీ టైమ్స్.. ఓన్లీ వన్స్ ఫసక్ అంటూ మోహన్ బాబు చెప్పిన డైలాగును నేర్పించిన బన్నీ.. ఇప్పుడు ఏంట్రోయ్ గ్యాప్ ఇచ్చావ్ అంటూ తన డైలాగ్ చెప్పించాడు. ఇవ్వలే వచ్చింది అంటూ ముద్దు మాటలతో ఆకట్టుకుంది బన్నీ పాప. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అల్లు అర్జున్‌, పూజాహెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం “అల వైకుంఠపురములో”. అల్లు అరవింద్‌, ఎస్‌.రాధాకృష్ణ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతున్నది. అల్లు అర్జున్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాల్ని తెరకెక్కిస్తున్నారు. టబు, రాజేంద్రప్రసాద్‌, సచిన్‌ఖేడ్‌కర్‌, మురళీశర్మ, సముద్రఖని, జయరాం, సునీల్‌, నవదీప్‌, సుశాంత్‌, నివేథా పేతురాజ్‌, గోవిందా పద్మసూర్య, బ్రహ్మాజీ, హర్షవర్ధన్‌, రాహుల్‌ రామకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ పి.ఎస్‌.వినోద్‌, సంగీతం తమన్‌ అందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.

Related posts