telugu navyamedia
telugu cinema news trending

నాని “వి” కోసం అల్లు అరవింద్ భారీ ఆఫర్

V

నాచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు కాంబినేష‌న్‌లో మోహన‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘వి’. శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాకు శిరీష్‌, ల‌క్ష్మ‌ణ్‌, హ‌ర్షిత్ నిర్మాత‌లుగా వ్యవహరించారు. నాని కెరీర్‌లో 25వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాలో నివేదా థామ‌స్‌, అదితిరావు హైద‌రి హీరోయిన్లుగా నటించారు. ‘సైరా నరసింహా రెడ్డి’ ఫేమ్ అమిత్ త్రివేది సంగీతం అందించారు. ఇందులో నాని ఫుల్‌ లెంగ్త్‌ విలన్‌గా కనిపించనుండటం విశేషం. షూటింగ్ అంతా ఫినిష్ చేసుకొని విడుదలకు రెడీ అయిన ఈ సినిమా లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఆగిపోయింది. ఇక థియేటర్స్ మూతపడి మూడు నెలలు గడవటం, ఇప్పట్లో థియేటర్స్ తెరచుకునే పరిస్థితి లేకపోవడంతో కంప్లీట్ అయిన సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ‘వి’ కూడా ఆన్‌లైన్ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల కానున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ దిల్ రాజు ఇంట్రెస్ట్ చూపకపోవడంతో ఆ డీల్ ఆగిపోయిందని తెలిసింది. అయితే లేటెస్ట్ సమాచారం మేరకు ఈ ‘వి’ చిత్ర హక్కుల కోసం అల్లు అరవింద్ భారీ మొత్తం వెచ్చిస్తున్నారని తెలుస్తోంది. తన ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికపై ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్న అల్లు అరవింద్.. ఇందుకోసం దిల్ రాజు యూనిట్‌కి రూ.30 కోట్లు ఆఫ‌ర్ చేశారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే విడుదల చాలా ఆలస్యం కావడంతో అల్లు అరవింద్ ఆఫర్ అంగీకరించే ఆలోచన చేస్తున్నారట దిల్ రాజు.

Related posts

నాగ చైతన్య రికార్డులకు చెక్ పెడుతున్న సమంత

vimala p

కోలీవుడ్ హీరో ఆర్య, సాయేషాల వివాహం… ఈనెల 10న హైదరాబాద్ లో…!

vimala p

పబ్‌జి ప్రేమికులకు .. మరో శుభవార్త.. ఇక లైట్ తో ఎక్కడైనా..

vimala p