telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

స్కూల్ డ్రెస్ లో .. అదేం పని.. ప్రియా వారియర్ పై మరో వివాదం..

Priya-Prakash-Varrier

ప్రియా వారియర్ మరోసారి వివాదాలలో చిక్కుకుంది. ఆమె నటించిన చిత్రం ‘లవర్స్ డే’ పేరుతో తెలుగులో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విడుదలైన టీజర్ లో పాఠశాలలో ముద్దు పెట్టుకున్న సన్నివేశంపై మరోసారి వివాదాలు మొదలయ్యాయి. పాఠశాల లో అలాంటి పనులేంటని కొందరు అంటుంటే, స్కూల్ డ్రెస్ లో అదేం పని అని మరి కొందరు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇలాంటి చిత్రాలతో పాఠశాల వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని వారు తీవ్రంగా మండిపడుతున్నారు.

ఇక యువత అయితే ఈ వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ పై వెర్రి అభిమానంతో ఊగిపోతున్నారు. మరోపక్క ఆమె చేసే పనుల వల్ల సోషల్ మీడియాలో నెటిజెన్ల విమర్శలకు ఛాన్స్ ఇస్తుంది. ఒరు ఆధార్ లవ్ సినిమా టీజర్ లో కన్ను గీటిన ప్రియా ప్రకాశ్ ఆ ఒక్క టీజర్ తో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ క్రేజ్ క్యాష్ చేసుకునేందుకే, ఆ సినిమాను మిగతా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసేస్తున్నారు. అయితే మొదటి నుండి ఈ చిత్రంపై వచ్చిన వివాదాలన్నీ బ్రహ్మాండమైన ప్రచారంగా ఉపకరించాయనే చెప్పాలి, ఇప్పుడు తెలుగులో కూడా అదే జరుగుతుంది. అంటే తెలుగులో కూడా భారీ విజయాన్నే సాదించేట్టుగానే ఉంది. 14న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు.

ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డే టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు టీజర్ మరో సెన్సేషన్ అయ్యింది. ప్రియా పెదవులను హీరో రోషన్ అబ్ధుర్ లిప్ లాక్ హంగామా సృష్టించింది. దీనితో ప్రియా అదరచుంభనం మరోసారి వైరల్ అయ్యింది. అయితే ఈ సీన్ పై యూత్ ఎగబడి చూస్తుంటే, కొందరు మాత్రం కామెంట్స్ చేస్తున్నారు.

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాశ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యిందట. ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్స్ అవసరం ఉండగా కీర్తి సురేష్, మేఘా ఆకాష్ తో పాటుగా మూడవ హీరోయిన్ గా ప్రియా ప్రకాశ్ కూడా సెలెక్ట్ అయ్యిందట.

Related posts