సినిమా వార్తలు

అల్లరి నరేష్, సునీల్ మల్టీ స్టారర్

అల్లరి నరేష్ కు సుడిగాడు చిత్రం తరువాత పరాజయాలు తప్పలేదు. మళ్ళీ అదే దర్శకుడు, భీమినేని శ్రీనివాస్ తో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో సునీల్ కూడా కీలక పాత్రలో నటిస్తాడట. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి టైటిల్ ఇంకా నిర్ణయించలేదట.

అల్లరి నరేష్ సినిమాకి వెళ్తేనే సరిపడేంత హాస్యం, ఇంకా ఆ అల్లరికి సునీల్ తోడైతే హాస్యానికి లోటేముంటుంది చెప్పండి, ప్రస్తుతానికి ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన లేకపోయినా ‘సిల్లీ ఫెలో’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది.

ఏది ఏమైనా ఈ చిత్రంలో హాస్యానికి లోటుండదు సరికదా, ఈ ఇద్దరి నటులకు మంచి విజయం తెచ్చిపెట్టాలని కోరుకుందాం. ఈ చిత్ర విజయం దర్శకుడు భీమినేని కూడా ప్రధానమే.

Related posts

‘శైలజా రెడ్డి అల్లుడు’ వేడుకల్లో ‘దేవదాస్’

jithu j

"చల్ మోహన్ రంగ" ఎలా ఉందంటే…!

admin

తెలుగు సినిమా కన్వీనర్ గా యార్లగడ్డ సుప్రియ

admin

Leave a Comment