వార్తలు సినిమా వార్తలు

గంటలో శ్రీశైలం.. అరగంటలో కైలాసం… అద్భుతం

అల్లరి సినిమాతో వెండితెరకు పరిచయమైన కామెడీ హీరో అల్లరి నరేష్ తొట్టి గ్యాంగ్, గోపి గోడమీద పిల్లి, సీమ శాస్త్రి, ఫిట్టింగ్ మాస్టర్, సీమ టపాకాయ్, కెవ్వు కేక, జేమ్స్ బాండ్ లాంటి సినిమాలు చేస్తూ… ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రం మహర్షి సినిమాలో ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.. నరేష్ సినిమాలు వరుస పరాజయాలు పొందటంతో కష్టాల్లోనుంచి బయట పాడటానికి ప్రస్తుతం తగు జాగ్రత్తలు పాటించి సినిమాలు చేస్తున్నాడు… బీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సుడిగాడు సినిమా పేరుకు తగ్గట్టుగానే అల్లరి నరేష్ సుడి ఈ సినిమాలో బాగా తిరిగింది… అదే ఈ హీరో చివరి హిట్…

తాజాగా మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఓ సినిమాలో అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్ లో కామెడీ ఎంటర్ టైనర్ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటుంది.. కాగా శత్ర యూనిట్ ఈ సినిమాకు సంబందించిన ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టింది… బైక్ పై వెళుతూ అల్లరి నరేష్, సునీల్ ల మధ్య జరిగిన సంభాషణను టీజర్ గా డిజైన్ చేసి విడుదల చేసిన ఈ సినిమాలో కథానాయికలు పూర్ణ, చిత్ర శుక్ల లు నటిస్తుండగా

ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్ మెంట్ లు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నాయి… ఈ సినిమా టైటిల్ సిల్లీ ఫెలోస్… కాగా టీజర్ లో అల్లరి నరేష్… ఈ స్పీడులో వెళితే గంటలో శ్రీశైలానికి వెళ్ళిపోతాం కదా అంటే శ్రీశైలానికి ఎం కర్మ ఏకంగా కైలాసానికె వెళ్ళిపోతాం అని సునీల్ అంటూ అందరిని అలరిస్తుంది…

Related posts

టీడీపీ తెలుగు దోపిడి పార్టీగా మారిపోయింది: రాంమాధవ్

madhu

భారత్ ఓటమికి కారణం సెలక్టర్లే అంటున్న వెంగీ

jithu j

హైదరాబాద్ కి వాట్సాప్… ఎందుకోసమో తెలుసా

nagaraj chanti

Leave a Comment